20 రాష్ట్రాల్లో స్వచ్ఛభారత్‌ | swatcha bharath in 20 states | Sakshi
Sakshi News home page

20 రాష్ట్రాల్లో స్వచ్ఛభారత్‌

Published Sun, Oct 9 2016 10:15 PM | Last Updated on Mon, Sep 4 2017 4:48 PM

20 రాష్ట్రాల్లో స్వచ్ఛభారత్‌

20 రాష్ట్రాల్లో స్వచ్ఛభారత్‌

రాజాపేట : దేశంలోని 20 రాష్ట్రాల్లో స్వచ్ఛభారత్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు శ్రీ సత్యసాయి సేవాసమితి రంగారెడ్డి జిల్లా, ౖహైదరాబాద్‌ ఆరోగ్యశిబిరం ఇన్‌చార్జి ఎస్‌.సేతురామన్‌ తెలిపారు. మండలంలోని నెమిల గ్రామంలో శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం స్వచ్ఛభారత్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక శివాలయం ఆవరణలో పిచ్చిమొక్కలను తొలగించారు. ఈ సందర్భంగా సేతురామన్‌ మాట్లాడుతూ అక్టోబర్‌ 2 గాంధీ జయంతి పురస్కరించుకుని 20 శ్రీ సత్యసాయి బాబా అవతార్‌ దినోత్సవం వరకు స్వచ్చ్‌సే దివస్‌ తక్‌ పేరుతో భారత దేశంలోని 20 రాష్ట్రాల్లో స్వచ్ఛభారత్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ బూడిద కవిత, ఎంపీపీ పులి సత్యనారాయణ, సమితి కన్వీనర్‌ కృష్ణమూర్తి, సేవాదల్‌ సభ్యులు నారాయణ్, రామచంద్రం, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement