ప్రత్యామ్నాయ పంటలే మేలు
ప్రత్యామ్నాయ పంటలే మేలు
Published Tue, Jul 26 2016 1:36 AM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM
రాజాపేట : రైతులు పత్తికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని, తద్వారా అన్ని విధాలా ప్రయోజనం ఉంటుందని ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ బండారి శ్రీనివాస్, ఏడీఏహెచ్ యుగేందర్ సూచించారు. మండలంలోని సోమారం గ్రామానికి చెందిన రైతు 18 ఎకరాలలో సాగు చేసిన బత్తాయి తోటను పరిశీలించారు. సేద్యం, దిగుబడి, ఖర్చు తదితర విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పండ్లు, కూరగాయలు, పూల తోటలకు ప్రభుత్వం సబ్సిడీపై రుణాలు అందిజేస్తుందన్నారు. కాబట్టి రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని కోరారు. డ్రిప్, పాలీహౌస్ విధానంలో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రైతుల కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను వారు సద్వినియోగం చేసుకోవాలనపి కోరారు. కార్యక్రమంలో హార్టికల్చర్ అధికారులు వెంకట్‌రెడ్డి, యాదగిరిగుట్ట దేవస్థానం ఈఓ గీత, దేవాలయ ధర్మకర్త నర్సింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Advertisement