Published
Sat, Sep 3 2016 9:20 PM
| Last Updated on Mon, Sep 4 2017 12:09 PM
జనగామలో కలపడం సరికాదు
రాజాపేట : ఆలేరు, రాజాపేట, గూండాల మండలాలను జనగామలో కలిపితే ప్రజా ఉద్యమమే నిర్వహింస్తామని డీసీసీ ప్రసిడెంట్ బూడిద భిక్షమయ్యగౌడ్ అన్నారు. శనివారం మండలంలోని పాముకుంట గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆలేరు, రాజాపేట, గూండాల మండలాల ప్రజలు, రైతులు గత కొన్న సంవత్సరాల నుంచి భువనగిరి డివిజన్‌తో అనుబంధాన్ని కలిగి ఉంన్నారని, నేడు ఈ మండలాలను జనగామలో కలిపేందుకు చూస్తున్న ప్రభుత్వ ఆలోన సరైందికాదన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ గంగలో కలిసాయని, ఎప్పటికప్పుడు కాకి లెక్కలు చెబుతూ కాలం వెళ్లదీస్తు ప్రజలను మభ్యపెడుతున్నాడని విమర్శించారు. కరువుతో రైతులు అప్పులపాలు అవతున్నారని, వారిని వెంటనే అదుకోవాలని కోరారు. మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నీలం పద్మ, మండల పార్టీ అధ్యక్షుడు నెమిల మహేందర్‌గౌడ్, మహిళా అధ్యక్షురాలు ఎడ్ల బాలలక్ష్మి, నాయకులు రాంరెడ్డి, ఎన్.వెంకటస్వామి, ఏ.బాలయ్య, పి.యాదయ్య, శ్రీరాములు పాల్గొన్నారు.