
అనీల్, సునీత
అనీల్ మొగిలి, సునీత జంటగా కె.బి. కృష్ణ (బాలు) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కోనాపురంలో జరిగిన కథ’. పోషం మట్టారెడ్డి సమర్పణలో మచ్చ వెంకట్ రెడ్డి, భట్టు అంజిరెడ్డి, పల్లె వినయ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. కె.బి.కృష్ణ (బాలు) మాట్లాడుతూ– ‘‘మనిషిని మనిషిగా చూడకపోవడం తప్పు. అలా నిర్లక్ష్యం చేయడం వల్ల జరిగిన పరిణామాలు ఏంటి? అనేది మా చిత్ర కథాంశం. సమాజంలో మార్పు కోసం చేస్తున్న చిన్న ప్రయత్నమిది.
కొన్నేళ్ల క్రితం జరిగిన వాస్తవ ఘటనలతో ఈ చిత్రాన్ని రూపొందించాం. మా సినిమా కథంతా ఒక ఊరిలో జరుగుతుంది. ప్రశాంతంగా ఉన్న ఆ ఊరు కొన్ని ఘటనలతో ఉలిక్కి పడుతుంది. ఆ ఊరి ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు. ఈ ఘటనలకు కారణమైన నేపథ్యం తెలుసుకుని ఆశ్చర్యపోతారు. మంచి ప్రేమ కథ ఉంటూనే ఆద్యంతం ఉత్కంఠగా సాగుతుంది’’ అన్నారు. రేయాన్ రావుల్, హలీమ్ ఖాన్, ‘జబర్దస్త్’ కుమార్ నటించారు. సంగీతం: సత్య కశ్యప్, కెమెరా: శ్రీకాంత్.
Comments
Please login to add a commentAdd a comment