ప్రజలను మోసగిస్తున్న టీఆర్‌ఎస్ సర్కార్
ప్రజలను మోసగిస్తున్న టీఆర్‌ఎస్ సర్కార్
Published Sun, Oct 2 2016 11:08 PM | Last Updated on Mon, Sep 4 2017 3:55 PM
ఆలేరు : రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ సర్కార్ సాధ్యంకాని హామీలతో ప్రజలను మోసం చేస్తోందని డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ ఆరోపించారు. ఆలేరులోని ఇందిరాకాంగ్రెస్ భవనంలో ఆదివారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మిడ్‌మానేరు ప్రాజెక్టు, డబుల్ బెడ్‌రూం ఇళ్ల విషయంలో అవగాహన లేక హామీ ఇచ్చానని ఇటీవల సీఎం కేసీఆర్ పేర్కొనడం ఇందుకు నిదర్శనమన్నారు. జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నామని, ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. గతేడాది పంటలను నష్టపోయిన రైతులకు కేంద్ర ప్రభుత్వం రూ.972 కోట్లు తెలంగాణ రాష్ట్రానికి కేటాయిస్తే ఆ నిధులను ప్రభుత్వం వేరే పనులకు మళ్లించడం సిగ్గుచేటన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ప్రభుత్వం పరిహారం అందించాలని కోరారు. ప్రభుత్వం చేసే తప్పిదాలను గ్రామస్థాయి నుంచి ఎండగడుతామని హెచ్చరించారు. సమావేశంలో జనగాం ఉపేందర్‌రెడ్డి, జూకంటి రవీందర్, కొలుపుల హరినాథ్, ఎంఎస్ విజయ్‌కుమార్, నీలం పద్మ, ఎండీ.జైనోద్దీన్, కె.సాగర్‌రెడ్డి, ఎంఏ.ఎజాజ్, జూకంటి ఉప్పలయ్య, నీలం వెంకటస్వామి, ఇల్లెందుల మల్లేశ్, గ్యాదపాక నాగరాజు, సిరిగిరి సాగర్, భీజని మధు పాల్గొన్నారు.
Advertisement