రైల్వే గేట్ కోసం ఉద్యమిస్తాం
రైల్వే గేట్ కోసం ఉద్యమిస్తాం
Published Wed, Aug 17 2016 10:20 PM | Last Updated on Mon, Sep 4 2017 9:41 AM
ఆలేరు: ఆలేరులోని రైల్వేగేట్‌ను య«థావిధిగా కొనసాగించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు హెచ్చరించారు. ఆలేరులో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఆలేరులో రైల్వేగేట్‌ను మూసివేయడంతో సుమారు 20వేల మంది ప్రజల రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్వోబీ మీదుగా గేట్ ఇటువైపుకు రావాలంటే 2కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుందని చెప్పారు.
తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలని కోరారు. లేదంటే అఖిలపక్షం ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామన్నారు. సమావేశంలో టీడీపీ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు బండ్రు శోభారాణి, చామకూర అమరేందర్‌రెడ్డి, దడిగె ఇస్తారి, ఎండి జైనోద్దీన్, తునికి దశరధ, మొరిగాడి చంద్రశేఖర్, గ్యాదపాక దానయ్య, ఆలేటి ఆంజయ్య, జెట్ట సిద్దులు, మోర్తల సాంబిరెడ్డి, భోగ సంతోష్, గొట్టిపాముల శ్రీనివాస్, సిరమైన కృష్ణమూర్తి, ఎంఎ ఎక్బాల్, ఇక్కుర్తి రాజయ్య తదితరులు పాల్గొన్నారు,
Advertisement