railwary
-
రైల్వే ప్రయాణీకులకు అదిరిపోయే శుభవార్త..!
భారతీయ రైల్వే ప్రయాణీకులకు ఒక మంచి శుభవార్త తెలిపింది. ఇప్పటికే రైల్వే స్టేషన్లలో ఉచిత బ్రాడ్ బ్యాండ్ సేవలు అందిస్తున్న భారతీయ రైల్వే, ఇప్పుడు మరిన్ని సేవలను అందించేందుకు సిద్దం అయ్యింది. రైల్వే ప్రయాణీకులు రైల్వే స్టేషన్లలో పాన్, ఆధార్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా ఒక కొత్త సేవను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. రైల్ వైర్ సాథి కియోస్క్ పేరుతో ఈ కొత్త సేవలను అందించనున్నట్లు భారతీయ రైల్వే తెలిపింది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా మొదట వారణాసి, ప్రయాగ్‌రాజ్ సిటీ రైల్వే స్టేషన్లలో కామన్ సర్వీస్ సెంటర్లను జనవరిలో రైల్వేశాఖ ప్రారంభించింది. ఇప్పుడు దేశం మెుత్తం ఈ సేవలను విస్తరించే ఆలోచనలో ఉంది. రైల్వే స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులు రైల్ వైర్ సాథి కియోస్క్ కేంద్రాల వద్ద ఆధార్ కార్డు, పాన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే టికెట్ బుకింగ్, ఓటరు కార్డు, మొబైల్ రీచార్జ్, రైలు, విమాన, బస్సు టిక్కెట్లను కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ సేవ కేంద్రాలలో ఆదాయపు పన్ను, బ్యాంకింగ్, బీమా సంబంధించి పనులకు ఇక్కడే పూర్తి చేసుకోవచ్చు అని తెలిపింది. ఈ సదుపాయంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఎక్కువ లాభం చేకూరనుంది. ఇంటర్నెట్ సదుపాయ లేని మారుమూల ప్రాంత ప్రజలు ఆధార్, పాన్ కార్డు సేవలను పొందడం మరింత సులభం కానుంది. దేశవ్యాప్తంగా 200 స్టేషన్లలో ఈ ప్రత్యేక సేవలను త్వరలో ప్రారంభించనున్నట్లు పేర్కొంది. (చదవండి: అదిరిపోయిన రెనాల్ట్ కొత్త హైబ్రిడ్ కారు.. మైలేజ్ కూడా చాలా ఎక్కువే..!) -
జూన్ 30 వరకు బుక్ చేసుకున్న రైలు టికెట్లు రద్దు
న్యూఢిల్లీ: సాధారణ రైళ్లలో ప్రయాణానికి జూన్ 30వ తేదీ వరకు బుక్ చేసుకున్న రైలు టికెట్లను రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ గురువారం ప్రకటించింది. సాధారణ ప్రయాణికుల రైళ్లను జూన్ మాసాంతం వరకు నడిపే అవకాశం లేదు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. మే 1న ప్రారంభించిన శ్రామిక్ స్పెషల్ రైళ్లు, మే 12న ప్రారంభించిన ప్రత్యేక రైళ్లు కొనసాగుతాయని పేర్కొంది. మెయిల్/ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్, సబర్బన్ రైళ్లలో ప్రయాణానికి లాక్డౌన్ కంటే ముందు, లాక్డౌన్ సమయంలో జూన్ 30 వరకు బుక్ చేసుకున్న టికెట్లు రద్దవుతాయని, ప్రయాణికులకు టికెట్ మొత్తాన్ని వెనక్కి ఇవ్వనున్నట్లు తెలియజేసింది. ఈ–టికెట్ల కొనుగోలుదారులు ఆన్లైన్లోనే రీఫండ్ పొందవచ్చు. లాక్డౌన్ నేపథ్యంలో సాధారణ రైళ్ల రాకపోకలను మార్చి 25 నుంచి నిలిపివేసిన సంగతి తెలిసిందే. గమ్యస్థానం చిరునామా ఇవ్వాల్సిందే రైళ్లలో ప్రయాణించేవారు ఇకపై తాము చేరాల్సిన గమ్యస్థానం చిరునామాను తప్పనిసరిగా తెలియజేయాల్సి ఉంటుంది. ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటున్న వారి నుంచి ఈ చిరునామాలను రైల్వేశాఖ ఇప్పటికే సేకరిస్తోంది. రికార్డుల్లో భద్రపరుస్తోంది. ప్రయాణికుల్లో ఎవరికైనా కరోనా వైరస్ సోకినట్లు తేలితే.. వారితో కలిసి ప్రయాణించిన వారిని గుర్తించి, పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా ఈ ప్రక్రియ ప్రారంభించింది. రైల్వేకు సంబంధించి ఎలాంటి బుకింగ్లకైనా గమ్యస్థానం చిరునామా తెలపాలని రైల్వేశాఖ అధికార ప్రతినిధి బాజ్‌పాయ్ చెప్పారు. రైళ్లలో ప్రయాణించినవారిలో 12 మందికి కరోనా సోకినట్లు గతంలో బయటపడింది. -
విద్యుత్ తీగలు పట్టుకుని వ్యక్తి మృతి
సాక్షి, నెక్కొండ : హైపవర్ విద్యుత్ తీగలు పట్టుకున్నవ్యక్తి మృతి చెందిన సంఘటన నెక్కొండ మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్లో శనివారం తెల్లవారుజామున జరిగింది. రైల్వే స్టేషన్లో ఆగిఉన్న ఆయిల్ ట్యాంకర్‌పైకి గుర్తు తెలియని 40 సంవత్సరాల వ్యక్తి ఎక్కాడు. అతడు హైపవర్ విద్యుత్ తీగలను పట్టుకోవడంతో కరెంట్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న వరంగల్ రైల్వే పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి పంచనామా నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని వరంగల్ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. -
రైల్వే గేట్ కోసం ఉద్యమిస్తాం
ఆలేరు: ఆలేరులోని రైల్వేగేట్‌ను య«థావిధిగా కొనసాగించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు హెచ్చరించారు. ఆలేరులో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఆలేరులో రైల్వేగేట్‌ను మూసివేయడంతో సుమారు 20వేల మంది ప్రజల రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్వోబీ మీదుగా గేట్ ఇటువైపుకు రావాలంటే 2కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుందని చెప్పారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలని కోరారు. లేదంటే అఖిలపక్షం ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామన్నారు. సమావేశంలో టీడీపీ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు బండ్రు శోభారాణి, చామకూర అమరేందర్‌రెడ్డి, దడిగె ఇస్తారి, ఎండి జైనోద్దీన్, తునికి దశరధ, మొరిగాడి చంద్రశేఖర్, గ్యాదపాక దానయ్య, ఆలేటి ఆంజయ్య, జెట్ట సిద్దులు, మోర్తల సాంబిరెడ్డి, భోగ సంతోష్, గొట్టిపాముల శ్రీనివాస్, సిరమైన కృష్ణమూర్తి, ఎంఎ ఎక్బాల్, ఇక్కుర్తి రాజయ్య తదితరులు పాల్గొన్నారు,