Published
Sun, Aug 28 2016 6:41 PM
| Last Updated on Mon, Sep 4 2017 11:19 AM
ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం
ఆలేరు : చిన్నారుల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత సూచించారు. ఆలేరులో ఆదివారం బస్టాండ్ వద్ద చిన్నపిల్లల ఆస్పత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేటి ఆధునిక జీవితం, జీవనశైలి మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. చిన్నపిల్లల బరువు విషయంలో తల్లిదండ్రులు తప్పక బాధ్యత తీసుకోవాలని కోరారు. పిల్లలు క్రీడలు, వ్యాయామ రంగాల్లో పాలుపంచుకునేలా ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్ పరమేశ్వర్, రాజు, జెడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్, ఇన్‌చార్జి సర్పంచ్ దాసి సంతోష్, చింతకింది మురళి, బింగి రవి, ఆకవరం మోహన్‌రావు, ఉపేందర్, దూడం మధు పాల్గొన్నారు.