
రాజాపేట (ఆలేరు) : ఓ వార్డు అభ్యర్థి ఇంటిముందు గుర్తుతెలియని వ్యక్తులు పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, కోడిగుడ్డు, వేపకొమ్మలు పెట్టడంతో భయాందోళనకు గురవుతున్న సంఘటన మండలంలోని రఘునాథపురంలో చోటుచేసుకుంది. బాధితుడు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బింగి నాగేష్ పంచాయతీ ఎన్నికల్లో నాలుగో వార్డులో పోటీలో ఉన్నాడు. కాగా రాత్రి ఎన్నికల ప్ర చారం ముగించి శుక్రవారం తెల్లవారుజాము న లేచి చూసేసరికి ఇంటిముందు పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, వేపకొమ్మలు, కోడిగుడ్డుతో పూజలు చేసినట్లు కనిపించడంతో కుటుంబ సభ్యులంతా భయాందోళనకు గురయ్యారు. ఈ విషయం కాలనీవాసులకు తెలవడంతోవారంతా ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment