రైల్వేగేట్ తెరవాలని రాస్తారోకో
ఆలేరు : రైల్వేగేట్‌ను తెరిపించాలని కోరుతూ ఆదివారం ఆలేరులో అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకోతో కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం కల్గింది. ఈ కార్యక్రమంలో తునికి దశర«థ, ఎండీ సలీం, చెక్క వెంకటేశం, కుమార్, సిద్ధులు, నాగరాజు పాల్గొన్నారు.
కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు ..
రైల్వేగేట్‌ను తెరిపించాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు 8వ రోజుకు చేరుకున్నాయి. గుజ్జ అశోక్, కూళ్ల సిద్ధులు, అఫ్జల్ తదితరులు దీక్షలో పాల్గొనగా మంగ నర్సింహులు, తునికి దశర«థ, పులిపలుపుల మహేష్, ఎంఎ ఎక్బాల్, ఎనగందుల సురేష్, చామకూర అమరేందర్‌రెడ్డి, జూకంటి పెద్దఉప్పలయ్య, సలీం పాల్గొన్నారు.