రైల్వేగేట్‌ను తెరిచేవరకూ ఉద్యమం
రైల్వేగేట్‌ను తెరిచేవరకూ ఉద్యమం
Published Sat, Sep 3 2016 10:01 PM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM
ఆలేరు : ఆలేరులోని రైల్వేగేట్‌ను తెరిచేవరకు ఉద్యమిస్తామని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, డీసీసీ అధ్యక్షులు బూడిద భిక్షమయ్యగౌడ్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డా. కాసం వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఆలేరులో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గేట్ మూసివేతతో ఆలేరు రెండు భాగాలుగా విడిపోయిందన్నారు. గేట్ అవతల వైపు ఉన్న ప్రజలకు ఇబ్బందులు కల్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు నిర్మించిన ఆర్వోబీతో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని.. ఆర్‌యూబీ నిర్మించే వరకూ రైల్వేగేట్‌ను తెరిపించాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా ఆలేరును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆలేరు, రాజాపేట, గుండాల మండలాలను భువనగిరిలోనే యథావిధిగా కొనసాగించాలన్నారు. సమావేశంలో టీడీపీ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు బండ్రు శోభారాణి, డీసీసీబీ మాజీ డైరెక్టర్ జనగాం ఉపేందర్‌రెడ్డి, నీలం పద్మ, పులిపలుపుల మహేష్, జెట్ట సిద్దులు, కందగట్ల నరేందర్, ఎనగందుల సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement