ఏకకాలంలో పంట రుణాలు మాఫీ చేయాలి
ఆలేరు : ప్రభుత్వం ప్రకటించిన 3, 4వ విడతల రైతు రుణాలను ఒకేసారి మాఫీ చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బండ శ్రీశైలం డిమాండ్ చేశారు. ఆలేరులో శనివారం జరిగిన ఆ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆలేరు నియోజకవర్గంలో రైతులు పెట్టిన పెట్టుబడులకు దిగుబడి రాక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మంగ నర్సింహులు, వడ్డెమాన్ శ్రీనివాస్‌లు, దుంపల రాంరెడ్డి, నూకల భాస్కర్‌రెడ్డి, ఎలగల బాలయ్య, పిక్క గణేష్, ఎంఎ ఎక్బాల్, దూసరి సత్తయ్య పాల్గొన్నారు.