ఆలేరును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలి
ఆలేరును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలి
Published Thu, Sep 29 2016 9:41 PM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM
ఆలేరు : అన్ని అర్హతలున్న ఆలేరును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. ఈ మేరకు టీ డీపీ, సీపీఐ ఆధ్వర్యంలో పట్టణ బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ డివిజన్ విషయంలో ఎంపీ, ఎమ్మెల్యేలు చొరవ తీసుకోకపోవడం బాధకరమన్నారు. అలాగే ఆలేరు, రాజాపేట, గుండాల మండలాలను జనగామ డివిజన్‌లో కలపడం ఆశాస్త్రీయమన్నారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఒంటెద్దు పోకడలను అవలంబిస్తుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బండ్రు శోభారాణి, గోద శ్రీరాములు, ఆరె రాములు, చామకూర అమరేందర్‌రెడ్డి, చెక్క వెంకటేశ్, ఎండి సలీం, గుంటి మధుసూదన్‌రెడ్డి, జెట్ట సిద్దులు, గ్యాదపాక దానయ్య, సూదగాని రాజయ్య, గిరిరాజు వెంకటయ్య,జశ్వంత్, బాలయ్య, జెట్ట సిద్దులు, బండ శ్రీను, జూకంటి పెద్దఉప్పలయ్య, ఎండి రఫీ, గొట్టిపాముల శ్రీను, భోగ సంతోష్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement