దళితులను నిర్లక్ష్యం చేస్తున్నారు | Dalits are being ignored | Sakshi
Sakshi News home page

దళితులను నిర్లక్ష్యం చేస్తున్నారు

Published Mon, Sep 19 2016 6:47 PM | Last Updated on Mon, Sep 4 2017 2:08 PM

దళితులను నిర్లక్ష్యం చేస్తున్నారు

దళితులను నిర్లక్ష్యం చేస్తున్నారు

ఆలేరు : దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 70ఏళ్లు  కావస్తున్నా నేటికీ దళితులను చిన్నచూపు చూడడం తగదని టీ–ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వంగపల్లి శ్రీనివాస్‌మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. టీఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన మాదిగచైతన్య పాదయాత్ర సోమవారం ఆలేరుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెప్పులు కుట్టేవారికి, డప్పులు కొట్టేవారికి రూ. 2వేలు పెన్షన్‌ ఇవ్వాలని డిమాండ్‌  చేశారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలన్నారు.

ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులను దారిమళ్లిస్తున్నారని, నేత, గీత, బీడీ కార్మికులకు పెన్షన్‌లు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని, సమాజసేవ చేస్తున్న చెప్పులు కుట్టే, డప్పులు కొట్టేవారికి పెన్షన్‌లు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. నవంబర్‌ 18లోపు ప్రభుత్వం స్పందించకపోతే తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో  టీ–ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షులు యాతాకులు భాస్కర్, కందుల రామన్, గ్యార నరేష్, మాటూరు నాగరాజు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement