క్రీడలతోనే మానసికోల్లాసం
క్రీడలతోనే మానసికోల్లాసం
Published Fri, Sep 9 2016 7:08 PM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM
ఆలేరు : బాలబాలికల్లో మానసిక, శారీరక ఎదుగుదలకు క్రీడలు ఎంతగానో దోహదం చేస్తాయని డిప్యూటీæడీఈఓ మదన్‌మోహన్ అన్నారు. ఆలేరులో జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో తునికి సత్తమ్మ స్మారకార్థం భువనగిరి డివిజన్ స్థాయి కబడ్డీ (అండర్–14) బాలబాలికల విభాగంలో శుక్రవారం పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే ఆటలు ఆడితే పిల్లలు సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారని చెప్పారు. ఆటలకు పాఠశాలలే ప్రధాన వేదికలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ లక్ష్మీనారాయణ, హెచ్‌ఎంలు ఎలిజ»ñ త్, ఉదయశ్రీ, పీఈటీలు తునికి సాగర్, పూల నాగయ్య, తునికి చంద్రశేఖర్, గడసంతల మధుసూదన్, తునికి రవి, సౌజన్య, ప్రేమలత, వల్లాల ప్రభ, రెడ్డప్పరెడ్డి, పూసలోజు కృష్ణ, డా. స్టాలిన్‌బాబు, కృష్ణమూర్తి పాల్గొన్నారు.
Advertisement
Advertisement