క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి | Sports and recreational | Sakshi
Sakshi News home page

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి

Published Tue, Aug 30 2016 1:43 AM | Last Updated on Mon, Sep 4 2017 11:26 AM

Sports and recreational

మిర్యాలగూడ టౌన్‌ : క్రీడలు మానసిక ఉల్లాసాన్ని స్నేహా భావాన్ని పెంపొందిస్తాయని నాగార్జున డిగ్రీ, పీజీ కళాశాల కరస్పాండెంట్‌ అనుముల నర్సింహ్మరెడ్డి, రాష్ట్ర ప్రిన్సిపాళ్ల సంఘం ప్రధాన కార్యదర్శి మందడి నర్సిరెడ్డిలు అన్నారు. సోమవారం స్థానిక నాగార్జున డిగ్రీ, పీజీ కళాశాలలో ఇంటర్మీడీయేట్‌ జిల్లా స్థాయి కబడ్డీ, షూటింగ్‌ బాల్‌ జట్ల ఎంపిక ప్రక్రియ పోటీలను  ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో పట్టుదల, కృషి ఉంటే దేనినైనా సాధించవచ్చన్నారు. క్రీడల వలన శారీరక దార్యుడంతో పాటు స్నేహాభావాన్ని పెంపొందించవచ్చన్నారు. క్రీడల ద్వారా సమాజంలో మంచి గుర్తింపు క్రీడాకారుడికి ఉంటుందన్నారు. సెప్టెంబరు 10, 11, 12వ తేదిలలో మిర్యాలగూడలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో జరిగే రాష్ట్ర స్థాయి కబడ్డీ, షూటింగ్‌బాల్‌ పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ పోటీలలో పాల్గొనేందుకు అండర్‌–19 జిల్లా స్థాయి బాలబాలికల జట్లను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాగార్జున జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ అనుముల మధుసూధన్‌రెడ్డి, జూనియర్‌ లెక్చరర్ల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శాగంటి శ్రీనివాస్, అశోక్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు హెమ్లానాయక్, గేమ్స్‌ జిల్లా ఆర్గనైజింగ్‌ కార్యదర్శి, పీడీల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గవ్వ దయాకర్‌రెడ్డి, పీడీలు సోమ నర్సింహరెడ్డి, పి.అప్పారావు, బీఎల్‌ రావు, రిటైర్డ్‌ ఫీజికల్‌ డైరెక్టర్‌ రమేష్‌రెడ్డి, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ జి. మల్లయ్య తదితరులున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement