recreational
-
T20 World Cup 2022: అహో హేల్స్...
‘నేను మళ్లీ ప్రపంచకప్ ఆడతానని అనుకోలేదు’... సెమీస్ ముగిసిన తర్వాత అలెక్స్ హేల్స్ వ్యాఖ్య ఇది. బహుశా భారత అభిమానులు కూడా అదే జరిగి ఉంటే బాగుండేదని అనుకొని ఉంటారు! మూడేళ్ల పాటు ఆటకు దూరమై పునరాగమనంలో మళ్లీ చెలరేగుతున్న హేల్స్ కథ కూడా ఎంతో ఆసక్తికరం. ► ఇంగ్లండ్ దేశవాళీ టోర్నీలలో ఎంత గొప్ప ప్రదర్శన ఇచ్చినా మూడేళ్ల పాటు అతనికి టీమ్‌లో చోటు దక్కలేదు. ఆ బాధను అధిగమించి అతను ప్రపంచవ్యాప్తంగా టి20 లీగ్‌లలో ఆడుతూ వచ్చాడు. చివరకు ఈ ఏడాది జూన్‌లో మోర్గాన్ రిటైర్ అయ్యాడు... సెప్టెంబర్‌లో హేల్స్‌కు టీమ్‌లో స్థానం లభించింది. పాకిస్తాన్ పర్యటనలో ఆకట్టుకున్న అతను వరల్డ్ కప్‌లో కీలక ఇన్నింగ్స్‌లతో తానేంటో నిరూపించాడు. ► పాక్ టూర్ తర్వాత కూడా ఇంగ్లండ్ వరల్డ్ కప్ జట్టులో హేల్స్‌కు స్థానం దక్కలేదు. అయితే బెయిర్‌స్టో అనూహ్యంగా గాయపడటంతో తప్పనిసరి పరిస్థితుల్లో హేల్స్‌ను టీమ్‌లోకి తీసుకోవాల్సి వచ్చింది. అది ఎంత సరైన నిర్ణయమో ఇంగ్లండ్‌కు ఇప్పుడు తెలిసింది. ఈ టోర్నీలో నాలుగు ప్రధాన జట్లు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక, భారత్‌లతో జరిగిన మ్యాచ్‌లలో అతను 84, 52, 47, 86 నాటౌట్ పరుగులు సాధించి జట్టును ఫైనల్‌కు చేర్చాడు. –సాక్షి క్రీడావిభాగం -
క్రీడలతోనే మానసికోల్లాసం
ఆలేరు : బాలబాలికల్లో మానసిక, శారీరక ఎదుగుదలకు క్రీడలు ఎంతగానో దోహదం చేస్తాయని డిప్యూటీæడీఈఓ మదన్మోహన్ అన్నారు. ఆలేరులో జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో తునికి సత్తమ్మ స్మారకార్థం భువనగిరి డివిజన్ స్థాయి కబడ్డీ (అండర్–14) బాలబాలికల విభాగంలో శుక్రవారం పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే ఆటలు ఆడితే పిల్లలు సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారని చెప్పారు. ఆటలకు పాఠశాలలే ప్రధాన వేదికలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ లక్ష్మీనారాయణ, హెచ్ఎంలు ఎలిజ»ñ త్, ఉదయశ్రీ, పీఈటీలు తునికి సాగర్, పూల నాగయ్య, తునికి చంద్రశేఖర్, గడసంతల మధుసూదన్, తునికి రవి, సౌజన్య, ప్రేమలత, వల్లాల ప్రభ, రెడ్డప్పరెడ్డి, పూసలోజు కృష్ణ, డా. స్టాలిన్‌బాబు, కృష్ణమూర్తి పాల్గొన్నారు. -
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి
మిర్యాలగూడ టౌన్ : క్రీడలు మానసిక ఉల్లాసాన్ని స్నేహా భావాన్ని పెంపొందిస్తాయని నాగార్జున డిగ్రీ, పీజీ కళాశాల కరస్పాండెంట్ అనుముల నర్సింహ్మరెడ్డి, రాష్ట్ర ప్రిన్సిపాళ్ల సంఘం ప్రధాన కార్యదర్శి మందడి నర్సిరెడ్డిలు అన్నారు. సోమవారం స్థానిక నాగార్జున డిగ్రీ, పీజీ కళాశాలలో ఇంటర్మీడీయేట్ జిల్లా స్థాయి కబడ్డీ, షూటింగ్ బాల్ జట్ల ఎంపిక ప్రక్రియ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో పట్టుదల, కృషి ఉంటే దేనినైనా సాధించవచ్చన్నారు. క్రీడల వలన శారీరక దార్యుడంతో పాటు స్నేహాభావాన్ని పెంపొందించవచ్చన్నారు. క్రీడల ద్వారా సమాజంలో మంచి గుర్తింపు క్రీడాకారుడికి ఉంటుందన్నారు. సెప్టెంబరు 10, 11, 12వ తేదిలలో మిర్యాలగూడలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగే రాష్ట్ర స్థాయి కబడ్డీ, షూటింగ్‌బాల్ పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ పోటీలలో పాల్గొనేందుకు అండర్–19 జిల్లా స్థాయి బాలబాలికల జట్లను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాగార్జున జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ అనుముల మధుసూధన్‌రెడ్డి, జూనియర్ లెక్చరర్ల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శాగంటి శ్రీనివాస్, అశోక్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు హెమ్లానాయక్, గేమ్స్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి, పీడీల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గవ్వ దయాకర్‌రెడ్డి, పీడీలు సోమ నర్సింహరెడ్డి, పి.అప్పారావు, బీఎల్ రావు, రిటైర్డ్ ఫీజికల్ డైరెక్టర్ రమేష్‌రెడ్డి, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జి. మల్లయ్య తదితరులున్నారు.