
రైతులతో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ గొంగిడి సునీత
తుర్కపల్లి (ఆలేరు) : గంధమల్ల ప్రాజెక్ట్ నిర్మాణానికి రైతులు, గ్రామస్తులు సహకరించాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం తుర్కపల్లి మండలంలోని గంధమల్ల గ్రామాన్ని సందర్శించి రైతులు, గ్రామస్తులతో కలిసి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గంధమల్ల ప్రాజెక్ట్ నిర్మాణం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి ముంపు గురవుతున్న రైతులు పూర్తిగా సహకరించాలన్నారు. ప్రాజెక్ట్ కింద నష్టపోతున్న భూ నిర్వాసితులకు అన్ని విధాల న్యాయం జరిగేందుకు తన వంతు కృషి చేస్తామని తెలిపారు. ప్రాజెక్ట్‌లు నిర్మాణం జరిగితేనే తెలంగాణ అన్ని విధాల సస్యశ్యామలమవుతుందన్నారు.
న్యాయమైన డిమాండ్లకు ఓ కమిటీ వేసుకొని తెలియజేస్తే అట్టి నిర్ణయాలను భారీ ప్రాజెక్ట్‌ల మంత్రి హరిశ్‌రావు, ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి నష్టపోయిన రైతులకు పూర్తి పరిహారం అందే వరకు అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ అనుమూల వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు జూపల్లిలక్ష్మీచంద్రయ్య,టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షడు పడాల శ్రీనివాస్,తలారి శ్రీనివాస్,జక్కుల వెంకటేశం,గజం మురళి,బొత్తరాములు,మందల మల్లయ్య,బిచ్చిరెడ్డి,జక్కుల కిష్టయ్య,కడిపె ఇస్తారి,జెల్ల వెంకటేశం,ఎలగల రాజు,కుంభం మల్లేశం గ్రామస్తులు,రైతులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment