whip Sunita
-
గంధమల్ల నిర్మాణానికి సహకరించాలి
తుర్కపల్లి (ఆలేరు) : గంధమల్ల ప్రాజెక్ట్ నిర్మాణానికి రైతులు, గ్రామస్తులు సహకరించాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం తుర్కపల్లి మండలంలోని గంధమల్ల గ్రామాన్ని సందర్శించి రైతులు, గ్రామస్తులతో కలిసి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గంధమల్ల ప్రాజెక్ట్ నిర్మాణం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి ముంపు గురవుతున్న రైతులు పూర్తిగా సహకరించాలన్నారు. ప్రాజెక్ట్ కింద నష్టపోతున్న భూ నిర్వాసితులకు అన్ని విధాల న్యాయం జరిగేందుకు తన వంతు కృషి చేస్తామని తెలిపారు. ప్రాజెక్ట్‌లు నిర్మాణం జరిగితేనే తెలంగాణ అన్ని విధాల సస్యశ్యామలమవుతుందన్నారు. న్యాయమైన డిమాండ్లకు ఓ కమిటీ వేసుకొని తెలియజేస్తే అట్టి నిర్ణయాలను భారీ ప్రాజెక్ట్‌ల మంత్రి హరిశ్‌రావు, ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి నష్టపోయిన రైతులకు పూర్తి పరిహారం అందే వరకు అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ అనుమూల వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు జూపల్లిలక్ష్మీచంద్రయ్య,టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షడు పడాల శ్రీనివాస్,తలారి శ్రీనివాస్,జక్కుల వెంకటేశం,గజం మురళి,బొత్తరాములు,మందల మల్లయ్య,బిచ్చిరెడ్డి,జక్కుల కిష్టయ్య,కడిపె ఇస్తారి,జెల్ల వెంకటేశం,ఎలగల రాజు,కుంభం మల్లేశం గ్రామస్తులు,రైతులు తదితరులు పాల్గొన్నారు. -
లాబీల్లో ‘ మద్యం’ పంచాయితీ
షాపు సీజైన యజమానిని వెంట తీసుకువచ్చిన విప్ సునీత లాబీలోకి ఎలా వచ్చావంటూ యజమానిపై మంత్రి ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: యాదగిరిగుట్టలో నాలుగు మద్యం షాపులను సీజ్ చేసిన వ్యవహారం అసెంబ్లీ లాబీల్లో సోమవారం చర్చనీయాంశమైంది. ఇటీవల ఎక్సైజ్ అధికారులు చేసిన దాడుల సందర్భంగా నాలుగు మద్యం షాపుల్లో 500 కేసుల ఎన్డీపీ (నాన్ డ్యూటీ పెయిడ్) మద్యం దొరికింది. దీంతో అధికారు లు ఆ నాలుగు షాపులతో పాటు వాటికి రింగ్ లీడర్‌గా ఉన్న వ్యక్తికి చెందిన మద్యం షాపును సీజ్ చేశారు. ఈ ఐదు మద్యం దుకాణాలకు మళ్లీ టెండర్ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే సోమవారం విప్ సునీత సదరు వ్యాపారిని వెంటబెట్టుకుని అసెంబ్లీ లాబీల్లోకి వచ్చి.. ఎక్సైజ్ మంత్రి పద్మారావును కలిశారు. సీజ్ చేసిన షాపును తెరిపించాలని కోరారు. దీంతో అది కుదరదంటూ మంత్రి సున్నితంగానే సమాధానమిచ్చారు. కానీ తన నియోజకవర్గం కార్యకర్త, పార్టీ కోసం కష్టపడిన ఆ వ్యక్తికి చెందిన వైన్‌షాపును ఎక్సైజ్ అధికారులు అన్యాయంగా సీజ్‌చేశారని, మళ్లీ తెరిపించాలని ఆమె మరోసారి పద్మారావును కోరారు. అయితే ఎక్సైజ్‌శాఖ పనిలో తాను జోక్యం చేసుకోబోనని మంత్రి తేల్చి చెప్పారు. అయినా వైన్‌షాపు ఓనర్ అసెంబ్లీ లాబీలోకి ఎలా వచ్చాడని ప్రశ్నించారు. తానే పాస్ ఇచ్చి తీసుకొచ్చినట్లు సునీత చెప్పడంతో మద్యం వ్యాపారిపై పద్మారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. మూసేసిన షాప్‌ను తెరిపించాలంటూ మరోసారి ఎవరితోనైనా చెప్పిస్తే పీడీ యాక్టు పెట్టి జైలుకు పంపిస్తానని హెచ్చరించారు. మంత్రి (తాను) పనిచేయడం లేదని సీఎంకు చెప్పినా ఫర్వాలేదని సునీతతో వ్యాఖ్యానించడం గమనార్హం. ఇదే సమయంలో అక్కడే ఉన్న మీడియాతోనూ మంత్రి కొద్దిసేపు తమ శాఖ అంశాలపై మాట్లాడారు. నాలుగేళ్ల కిందట బీర్ల ధరలు పెంచారని, దీనికోసం నియమించిన కమిషన్ కూడా బీర్ల ధరలు పెంచాలని సూచించిందని మంత్రి పద్మారావు చెప్పారు.