ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి
ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి
Published Wed, Oct 5 2016 10:23 PM | Last Updated on Mon, Sep 4 2017 4:17 PM
ఆలేరు : నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో ప్రజాభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆలేరును రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరుతూ టీడీపీ ఆధ్వర్యంలో 36 గంటల పాటు బుధవారం నిరహార దీక్ష చేపట్టారు. దీక్షలో కూర్చున్న టీడీపీ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు బండ్రు శోభారాణికి ఆయన సంఘీభావం తెలిపి మాట్లాడారు. రాజకీయ ప్రయోజనాలు పక్కనపెట్టి ప్రజాభీష్టానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ భవిష్యత్ తరాల కోసమే కొత్త జిల్లాలను ఏర్పాటు చెబుతున్న కేసీఆర్.. ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో ప్రజలను భాగస్వామ్యం చేయాలని కోరారు. ఆలేరును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాల్సిందేనన్నారు. దీక్షకు సీపీఐ నాయకులు గోద శ్రీరాములు, చెక్క వెంకటేశం సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో దడిగె ఇస్తారి, ఆరె రాములు, చామకూర అమరేందర్‌రెడ్డి, ఎండీ సలీం, మధుసూదన్‌రెడ్డి, గ్యాదపాక దానయ్య, జెట్ట సిద్దులు, సూదగాని రాజయ్య, భోగ సంతోష్‌కుమార్, ఎండి రఫీ, జూకంటి పెద్దఉప్పలయ్య, పల్లెపాటి బాలయ్య, బండ శ్రీను పాల్గొన్నారు.
Advertisement
Advertisement