Published
Wed, Aug 17 2016 11:47 PM
| Last Updated on Mon, Sep 4 2017 9:41 AM
గేట్ తెరిపించాలని రైల్వేజీఎంకు వినతి
ఆలేరు : ఆలేరులో రైల్వేగేట్ మూసివేతతో ప్రజలకు కలుగుతున్న అసౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని తక్షణ మే తెరిపించాలని కోరుతూ భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, పలు పార్టీల నాయకులు బుధవారం దక్షిణ మ«ధ్య రైల్వే జీఎం రవీంద్రగుప్తాను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మాట్లాడుతూ వారం రోజుల్లోగా సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని జీఎం హామీ ఇచ్చారన్నారు. రైల్వే అండర్ బ్రిడ్జి(ఆర్‌యుబీ) ఏర్పాటుకు, ఆర్‌యుబీ ఏర్పాటయ్యే వరకు రైల్వేగేట్ తెరిపేంచేందుకు రైల్వేబోర్డు దృష్టికి తీసుకెళ్తామని కూడా హామీ ఇచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్, ఇన్‌చార్జ్ సర్పంచ్ దాసి సంతోష్, నాయకులు ఎండి జైనొద్దీన్, తునికి దశరథl, మొరిగాడి చంద్రశేఖర్, దానియల్, గంపల విజయ్, గుత్తా శమంతారెడ్డి తదితరులు ఉన్నారు.