28న రైల్వే జీఎం కర్నూలు రాక?
Published Wed, Feb 22 2017 12:25 AM | Last Updated on Tue, Sep 5 2017 4:16 AM
కర్నూలు(రాజ్‌విహార్): దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజరు వినోద్‌కుమార్ యాదవ్ ఈనెల 28వ తేదీన కర్నూలకు రానున్నట్లు సమాచారం. గత 20 రోజుల క్రితమే పర్యటన తేదీ ఖరారు కావడంతో స్థానిక అధికారులు అభివృద్ధి, మరమ్మత్తు పనులు చేపడుతున్నారు. అయితే పర్యటనకు సంబంధించి మినిట్ టు మినిట్ ప్రొగ్రాం వివరాలు ఏవీ రాలేదని సిటీ రైల్వే స్టేషన్ మేనేజరు మక్బూల్ హుసేన్ తెలిపారు. కాగా ప్రస్తుతం హైదరాబదు డివిజన్ డీఆర్‌ఎంగా పనిచేస్తున్న అరుణా సింగ్‌కు ఇటీవలే స్థాన చలనం కలిగించినా ఎవరినీ నియమించలేదు. 28వ తేదీలోపు ఎవరినైనా నియమిస్తే పర్యటన వాయిదా పడే అవకాశం ఉంది. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా కూడా వాయిదా పడోచ్చని అధికారులు చర్చించుకుంటున్నారు.
Advertisement
Advertisement