రూ. 1024 కోట్లతో గోదాంల నిర్మాణం
రూ. 1024 కోట్లతో గోదాంల నిర్మాణం
Published Tue, Aug 9 2016 7:51 PM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM
ఆలేరు : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రూ. 1024 కోట్లతో 330 గోదాంల నిర్మాణం చేపడుతున్నామని మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ శరత్ తెలిపారు. ఆలేరు మార్కెట్ కమిటీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 95 శాతం గోదాంల నిర్మాణాలు పూర్తయ్యాయని, మరో 20 రోజుల్లో నిర్మాణంలో ఉన్న గోదాంలు పూర్తవుతాయని చెప్పారు. రైతులు రైతుబం«ధు పథకం కింద ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు, ఎరువులు, పీడీఎస్ బియాన్ని నిల్వ చేసుకునేందుకు ఈ గోదాంలు ఉపయోగపడుతాయని తెలిపారు. అలాగే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 180 మార్కెట్ యార్డుల్లో రూ. 285 కోట్లతో స్వాగత తోరణాలు, ఫ్లాట్‌ఫామ్స్, కవర్ షెyŠ లు నిర్మిస్తున్నామని చెప్పారు. హరితహారం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గతేడాది నాలుగున్నర లక్షల మొక్కలు నాటామన్నారు. ఇందులో 80 శాతం వరకు మొక్కలను కాపాడగలిగామని చెప్పారు. ఈ ఏడాది ఎనిమిదిన్నర లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. మొక్కల పెంపకం సామాజిక బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం వహించిన వారిని ఇటీవల నలుగురిని సస్పెండ్ చేశామని తెలిపారు. ఈ సమావేశంలో చైర్మన్ కాలె సుమలత, వైస్ చైర్మన్ నాయిని రామచంద్రారెడ్డి, సెక్రటరీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Advertisement