సాక్షి, బొమ్మలరామారం: తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే పోలీసులు.. సంజయ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. దీంతో, బొమ్మలరామారం పీఎస్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. అయితే, సంజయ్ అరెస్ట్ తర్వాత పోలీసులు లీగల్ ప్రొసీడింగ్స్‌కు రెడీ అయ్యారు.
ఈ నేపథ్యంలో పోలీసులు.. భారీ కాన్వాయ్‌తో ఫుల్ భద్రత మధ్య బండి సంజయ్‌ను బొమ్మలరామారం పీఎస్ నుంచి తరలించారు. భువనగిరి మేజిస్ట్రేట్ నివాసంలో సంజయ్‌ను హాజరుపరచనున్నట్టు పోలీసులు తెలిపారు. మరోవైపు.. కాన్వాయ్ భువనగిరి దాటి ఆలేరు వైపు వెళ్తున్నట్టు సమాచారం. దీంతో, బండి సంజయ్‌ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారన్న ఆందోళన బీజేపీ శ్రేణుల్లో నెలకొంది.
- ఇక, సంజయ్‌ను వరంగల్ తరలిస్తుండగా పెంబర్తి వద్ద పోలీసుల కాన్వాయ్‌ను బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. రోడ్లపై టైర్లు తగలబెట్టి కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో, పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేశారు. ఈ క్రమంలో పలువురు బీజేపీ నేతలకు గాయాలయ్యాయి. మరోవైపు.. పెంబర్తి వద్ద వరంగల్ పోలీసులు.. బండి సంజయ్‌ను హ్యాండోవర్ చేసుకున్నారు. కాసేపట్లో బండి సంజయ్‌ను జడ్జి వద్ద ప్రవేశపెట్టనున్నారు పోలీసులు.
- వరంగల్ పోలీసులు బండి సంజయ్‌ను పాలకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల తర్వాత సంజయ్‌ను పోలీసులు వరంగల్‌కు తీసుకువెళ్లనున్నారు.
- మరికాసేపట్లో వరంగల్ కోర్టులో బండి సంజయ్‌ను హాజరుపరుచున్నారు. అలాగే, బండి సంజయ్ అరెస్ట్‌కు సంబంధించిన వివరాలను సీపీ రంగనాథ్ వివరించనున్నారు.
- అంతకుముందు, బండి సంజయ్‌ను తరలిస్తున్న క్రమంలో బీజేపీ కార్యకర్తలు పోలీసులను అడ్డుకున్న ప్రయత్నం చేశారు. దీంతో, పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సంజయ్ అరెస్ట్‌ను నిరసిస్తూ బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. మహిళ కార్యకర్తలు పోలీసు వాహనాలకు అడ్డంగా కూర్చుని నిరసన తెలిపారు. మహిళా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పీఎస్ వద్ద యుద్దవాతవరణం నెలకొంది.
- మరోవైపు.. అకారణంగా బండి సంజయ్ అరెస్ట్‌ను బీజేపీ సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలో హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్‌ను బీజేపీ లీగల్ సెల్ దాఖలు చేసింది. బీజేపీ లీగల్ సెల్.. చీఫ్ జస్టిస్ నివాసానికి వెళ్లి పిటిషన్ దాఖలు చేసింది.
- బీజేపీ నేత విజయశాంతిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment