బొమ్మలరామారం (నల్లగొండ) : ఆడుకోవడానికి వెళ్లిన బాలిక ప్రమాదవశాత్తు నీటిగుంటలో పడి మృతిచెందింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా బొమ్మలరామారం మండలం మైసిరెడ్డిపల్లి గ్రామ శివారులో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. స్థానిక ఇంజనీరింగ్ కళాశాల సమీపంలోని నీటి గుంట వద్ద ఆడుకుంటున్న అనురాధ(10) ప్రమాదవశాత్తు అందులో పడి మృత్యువాత పడింది. ఇది గుర్తించిన స్థానికులు మృతదేహన్ని బయటకు తీశారు. బాలిక మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.