సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సైకిల్ యాత్ర | software engineer ravikiran bicycle tour for environment issues | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సైకిల్ యాత్ర

Published Sat, Jan 28 2017 7:39 PM | Last Updated on Mon, Oct 22 2018 7:50 PM

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సైకిల్ యాత్ర - Sakshi

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సైకిల్ యాత్ర

యాలాల: పర్యావరణ పరిరక్షణ కోరుతూ దేశవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ చేపట్టిన సైకిల్‌ యాత్ర నేటితో 22 రోజులు పూర్తి చేసుకుంది. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌, నిజామాబాద్‌ జిల్లా వాసి అయిన రవికిరణ్‌ శనివారం సాయంత్రం వికారాబాద్‌ జిల్లా తాండూరు పరిధిలోని యాలాల చేరుకున్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మీదుగా కొనసాగిన ఆయన సైకిల్‌ యాత్ర తాండూరుకు చేరింది. ఇప్పటివరకు 1545 కిలోమీటర్ల దూరం తిరిగానని, 22 రోజులు పూర్తి అయ్యాయని రవికిరణ్‌ చెప్పారు. మొత్తం ఐదు వేల కిలోమీటర్ల యాత్ర పూర్తి చేయాలని, తద్వారా పర్యావరణంపై అవగాహనా పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఈ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement