సాఫ్ట్వేర్ ఇంజినీర్ సైకిల్ యాత్ర
యాలాల: పర్యావరణ పరిరక్షణ కోరుతూ దేశవ్యాప్తంగా సాఫ్ట్వేర్ ఇంజినీర్ చేపట్టిన సైకిల్ యాత్ర నేటితో 22 రోజులు పూర్తి చేసుకుంది. సాఫ్ట్వేర్ ఇంజినీర్, నిజామాబాద్ జిల్లా వాసి అయిన రవికిరణ్ శనివారం సాయంత్రం వికారాబాద్ జిల్లా తాండూరు పరిధిలోని యాలాల చేరుకున్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మీదుగా కొనసాగిన ఆయన సైకిల్ యాత్ర తాండూరుకు చేరింది. ఇప్పటివరకు 1545 కిలోమీటర్ల దూరం తిరిగానని, 22 రోజులు పూర్తి అయ్యాయని రవికిరణ్ చెప్పారు. మొత్తం ఐదు వేల కిలోమీటర్ల యాత్ర పూర్తి చేయాలని, తద్వారా పర్యావరణంపై అవగాహనా పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఈ సాఫ్ట్వేర్ ఇంజినీర్ వివరించారు.