వచ్చే మూడు నెలల్లో మోదీ ప్రభుత్వంలోని మంత్రులు ప్రపంచం నలుమూలలా పర్యటించనున్నారు.
న్యూఢిల్లీ: వచ్చే మూడు నెలల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వంలోని మంత్రులు ప్రపంచం నలుమూలలా పర్యటించనున్నారు. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలున్న 192 దేశాల్లో ఎన్డీఏ మంత్రులు పర్యటించాలన్న లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో మూడు నెలల గడువులో 68 దేశాల్లో పర్యటించనున్నారు.
హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హంగేరీ, న్యాయ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఎస్తోనియా, లాత్వియా, ఎరువుల మంత్రి అనంత్ కుమార్ టాంగో, ఆహార మంత్రి రాం విలాస్ పాశ్వాన్ మారిషస్‌లో పర్యటిస్తారు. ఈ ఏడాది చివరికల్లా కేంద్రమంత్రులు పర్యటించని దేశాలు ఉండొద్దన్న విషయాన్ని ప్రస్తావిస్తూ... 68 దేశాల్లో ఇంకా ఎవరూ పర్యటించనట్లు తమ శాఖ గుర్తించిందని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ మంత్రిత్వ శాఖలకు లేఖలు రాశారు.