వరల్డ్‌ కప్‌లో ఆ రికార్డు గుర్తుందా? | World Cup Fastest Century Record Completes 7 Years | Sakshi
Sakshi News home page

Published Fri, Mar 2 2018 3:06 PM | Last Updated on Fri, Mar 2 2018 3:16 PM

World Cup Fastest Century Record Completes 7 Years - Sakshi

ఐర్లాండ్‌ ఆటగాడు కెవిన్ ఓబ్రెయిన్

సాక్షి, స్పోర్ట్స్‌ : వరల్డ్‌ కప్‌లో నమోదైన ఓ రికార్డుకు నేటితో సరిగ్గా 7 ఏళ్లు పూర్తయ్యింది. ఐర్లాండ్‌ ఆటగాడు కెవిన్ ఓబ్రెయిన్ వీర విహారంతో వరల్డ్‌ కప్‌లో వేగవంతంగా సెంచరీ చేసిన ఆటగాడిగా ఓబ్రెయిన్‌ తన పేరిట రికార్డు లిఖించుకున్నాడు. 

మార్చి 2, 2011 బెంగళూర్‌ చిన్నస్వామి స్టేడియంలో ఇంగ్లాండ్‌తో ఐర్లాండ్‌ మ్యాచ్‌ జరిగింది. ఐర్లాండ్‌ బౌలర్లను ఆటాడుకున్న ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ 328 లక్ష్యాన్ని ప్రత్యర్థికి నిర్దేశించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్‌ కెవిన్‌ ఓబ్రెయిన్‌ ఊచకోతతో చరిత్రాత్మక విజయాన్ని అందుకుంది.

మొత్తం 63 బంతుల్లో 113 పరుగులు సాధించిన ఓబ్రెయిన్‌ 13 ఫోర్లు, 6 సిక్స్‌లు బాదాడు. ఈ క్రమంలో 50 బంతుల్లోనే అతను సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇప్పటిదాకా ప్రపంచ కప్‌లో నమోదైన ఫాస్టెస్ట్‌ సెంచరీ ఇదే కావటం విశేషం. ఓబ్రెయిన్‌ రికార్డును గుర్తు చేస్తూ ఐసీసీ తన ట్విట్టర్‌ ఖాతాలో అతని ఇన్నింగ్స్‌ను పోస్టు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement