Kevin OBrien
-
గర్జించిన గంభీర్.. క్రిస్ గేల్ పోరాటం వృధా
లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2023 సీజన్లో మరో రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. గుజరాత్ జెయింట్స్-ఇండియా క్యాపిటల్స్ మధ్య నిన్న (డిసెంబర్ 6) జరిగిన మ్యాచ్ చివరి నిమిషం వరకు హోరాహోరీగా సాగింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో గుజరాత్‌పై ఇండియా క్యాపిటల్స్ 12 పరుగుల తేడాతో గెలుపొందింది. క్రిస్ గేల్ (55 బంతుల్లో 84; 9 ఫోర్లు, 4 సిక్సర్లు), కెవిన్ ఓబ్రెయిన్ (33 బంతుల్లో 57ప 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో పోరాడినప్పటికీ గుజరాత్‌ను గెలిపించలేకపోయారు. క్యాపిటల్స్ నిర్ధేశించిన లక్ష్యానికి గుజరాత్ 13 పరుగుల దూరంలో నిలిచిపోయింది. గర్జించిన గంభీర్.. తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ (30 బంతుల్లో 51; 7 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌లో కిర్క్ ఎడ్వర్డ్స్ (26), కెవిన్ పీటర్సన్ (26), రికార్డో పావెల్ (28), బెన్ డంక్ (30), చిప్లి (35) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. గుజరాత్ బౌలర్లలో ఎమ్రిట్, రజత్ భాటియా చెరో 2 వికెట్లు.. శ్రీశాంత్, లడ్డా, ప్రసన్న తలో వికెట్ దక్కించుకున్నారు. Gambhir 🤝 Knock-out game. Captain Gambhir lead by example in LLC.....!!!!!pic.twitter.com/ZN6edPYZtb— Johns. (@CricCrazyJohns) December 6, 2023 గేల్ పోరాటం వృధా.. 224 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్.. క్రిస్ గేల్, కెవిన్ ఓబ్రెయిన్ పోరాడినప్పటికీ విజయతీరాలకు చేరలేకపోయింది. గేల్, ఓబ్రెయిన్ క్రీజ్‌లో ఉండగా.. గుజరాత్ గెలుపు సునాయాసమేనని అంతా అనుకున్నారు. అయితే ఆ జట్టు ఆఖరి 3 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే చేసి నాలుగు వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది. గేల్, ఓబ్రెయిన్లకు ఇతరుల నుంచి సహకారం లభించకపోవడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 211 పరుగులు మాత్రమే చేయగలిగింది. జాక్ కల్లిస్ (11), రిచర్డ్ లెవి (11), అభిషేక్ ఝున్‌ఝున్‌వాలా (13) విఫలమయ్యారు. క్యాపిటల్స్ బౌలర్లలో రస్టీ థీరన్, ఈశ్వర్ పాండే చెరో 2 వికెట్లు.. ఫిడేల్ ఎడ్వర్డ్స్, ఇసురు ఉడాన తలో వికెట్ దక్కించుకున్నారు. -
వన్డే ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ ఎవరిదో తెలుసా?
వన్డే వరల్డ్ కప్ 2023 ప్రారంభానికి సమయం ఆసన్నమైంది. మరో 24 గంటల్లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. తొలి మ్యాచ్‌లో ఢిఫెడింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మెగా టోర్నీ నేపథ్యంలో వన్డే వరల్డ్‌కప్‌లో ఫాస్టెస్ట్ సెంచరీలు చేసిన టాప్-5 ఆటగాళ్లపై ఓ లూక్కేద్దం. కెవిన్ ఓబ్రియన్.. వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యంత వేగవంతంగా సెంచరీ చేసిన రికార్డు ఐర్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ ఓబ్రియన్ పేరిట ఉంది. భారత్ వేదికగా జరిగిన 2011 వన్డే ప్రపంచకప్‌లో ఓబ్రియన్ ఈ ఫీట్ నమోదు చేశాడు. ఈ టోర్నీలో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు కేవలం 50 బంతుల్లోనే సెంచరీ సాధించి రికార్డులకెక్కాడు. 6వ స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఓబ్రియన్ బౌండరీల వర్షం కరిపించాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 63 బంతులు ఎదుర్కొన్న కెవిన్ 13 ఫోర్లు, 6 సిక్స్‌లతో 113 పరుగులు చేశాడు. ఇంగ్లండ్‌పై 328 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. అతడి ఇన్నింగ్స్ ప్రపంచకప్ చరిత్రలోనే చిరస్మరణీయంగా మిగిలిపోనుంది. గ్లెన్ మాక్స్వెల్ ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో ఓబ్రియన్ తర్వాత ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ ఉన్నాడు. సొంతగడ్డపై జరిగిన 2015 వన్డే ప్రపంచకప్‌లో కేవలం 51 బంతుల్లోనే మాక్సీ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. శ్రీలంకతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో మాక్స్వెల్ ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో 53 బంతులు ఎదుర్కొన్న మాక్సీ 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 102 పరుగులు చేశాడు. ఏబీ డివిలియర్స్ ఇక లిస్ట్‌లో మాక్స్వెల్ తర్వాత ఈ లిస్ట్‌లో దక్షిణాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ ఉన్నాడు. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన 2015 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌పై కేవలం 52 బంతుల్లోనే డివిలియర్స్ సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో 66 బంతులు ఆడిన ఏబీడీ.. 17 ఫోర్లు, 8 సిక్స్‌లతో 162 పరుగులు చేశాడు. ఇయాన్ మోర్గాన్ ఇక ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ నాలుగో స్ధానంలో ఉన్నాడు. సొంత గడ్డపై జరిగిన 2019 వన్డే ప్రపంచకప్‌లో మోర్గాన్ 57 బంతుల్లో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఆఫ్గానిస్తాన్‌పై ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 71 బంతులు ఆడిన మోర్గాన్ 4 ఫోర్లు, 17 సిక్స్‌లతో 148 పరుగులు చేశాడు. మాథ్యూ హేడన్ ఇక ఈ జాబితాలో ఐదు స్ధానంలో ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం మాథ్యూ హేడన్ ఉన్నాడు. 2007 వన్డే ప్రపంచకప్‌లో హేడన్.. దక్షిణాఫ్రికాపై 66 బంతుల్లో శతకాన్ని సాధించాడు. మొత్తంగా 68 బంతులు ఎదుర్కొన్న హేడన్ 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో 101 పరుగులు చేశాడు. చదవండి: Asian Games 2023: శ్రీలంక ఘోర పరాజయం.. సెమీఫైనల్లో ఆఫ్గానిస్తాన్ -
శతక్కొట్టిన పాల్ స్టిర్లింగ్.. అత్యంత అరుదైన జాబితాలో చోటు
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఐర్లాండ్ ఆటగాడు పాల్ స్టిర్లింగ్ (103) శతక్కొట్టాడు. తద్వారా ఓ అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు. మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన 23 ఆటగాడిగా, ఈ ఘనత సాధించిన రెండో ఐరిష్ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. స్టిర్లింగ్‌కు ముందు కెవిన్ ఓబ్రెయిన్ మూడు ఫార్మాట్లలో సెంచరీలు సాధించాడు. ఓవరాల్‌గా ఈ ఘనతను తొలుత విండీస్ విధ్వంకర వీరుడు క్రిస్ గేల్ సాధించగా.. భారత్ తరఫున సురేశ్ రైనా సాధించాడు. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఐర్లాండ్.. రెండో రోజు రెండో సెషన్ సమయానికి 121 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 415 పరుగులు చేసింది. స్టిర్లింగ్‌తో పాటు కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీ (95), లోర్కన్ టక్కర్ (80), కర్టిస్ క్యాంఫర్ (68 నాటౌట్) సత్తా చాటారు. లంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య, అషిత ఫెర్నాండో తలో 2 వికెట్లు, విశ్వ ఫెర్నాండో, రమేశ్ మెండిస్ చెరో వికెట్ పడగొట్టారు. -
రోహిత్ శర్మ చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా!
ఇండోర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన అఖరి టీ20లో 49 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. 228 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 178 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో కార్తీక్(46) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ తీవ్రంగా నిరాశపరిచాడు. రబాడ వేసిన తొలి ఓవర్లో రోహిత్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో రోహిత్ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. పురుషుల టీ20 క్రికెట్లో అత్యధిక సార్లు సింగిల్ డిజిట్ స్కోర్‌కే ఔటైన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. రోహిత్ ఇప్పటి వరకు 43 సార్లు సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యాడు. ఇంతకుముందు ఈ చెత్త రికార్డు ఐర్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ ఓబ్రియన్(42 సార్లు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో రోహిత్ ఈ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. కాగా టీ20 ప్రపంచకప్-2022 కోసం టీమిండియా ఆక్టోబర్6న ఆస్ట్రేలియాకు బయలు దేరనుంది. చదవండి: T20 World Cup 2022: బుమ్రా స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు? రోహిత్ ఎమన్నాడంటే? -
కెవిన్ ఒబ్రెయిన్ సెంచరీ .. గుజరాత్ జెయింట్స్ ఘన విజయం
ఐర్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ ఒబ్రెయిన్ లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022లో శతకంతో మెరిశాడు. అతని విధ్వంసం ధాటికి గుజరాత్ జెయింట్స్ మరో 8 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. శనివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా గుజరాత్ జెయింట్స్, ఇండియా క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఆష్లే నర్స్ 43 బంతుల్లో 8 ఫోర్లు, 9 సిక్సర్లతో 103 పరుగులు నాటౌట్ విధ్వంసం సృష్టించగా.. దినేశ్ రామ్‌దిన్ 31 పరుగులు చేశాడు. వీరిద్దరి మినహా మిగతావారెవరు పెద్దగా రాణించింది లేదు. గుజరాత్ జెయింట్స్ బౌలింగ్‌లో తిసారా పెరీరా, ఎమ్రిత్, అప్పన్న తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జెయింట్స్ 18.4 ఓవర్లలో టార్గెట్‌ను అందుకుంది. కెవిన్ ఓబ్రెయిన్ 61 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 106 పరుగుల చేయగా.. పార్థివ్ పటేల్ 24, యష్పాల్ సింగ్ 21 పరుగులు చేశారు. ఇండియా క్యాపిటల్స్ బౌలింగ్‌లో ప్రవీణ్ తాంబే 3, లియామ్ ప్లంకెట్ 2, ఆష్లే నర్స్, మిచెల్ జాన్సన్లే తలా ఒక వికెట్ తీశారు. -
ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించి.. పాకిస్తాన్‌పై సెంచరీతో మెరిసి!
ఐర్లాండ్ క్రికెట్లో ఓ శకం ముగిసింది. దిగ్గజ ఆల్‌రౌండర్ కెవిన్ ఒబ్రెయిన్ అంతర్జాతీయ క్రికెట్‌కు మంగళవారం రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐర్లాండ్ చారిత్రాత్మక విజయాలు సాధించడంలో కీలకంగా వ్యవహరించిన అతడిని గత ఏడాది కాలంగా సెలక్టర్లు జట్టుకు ఎంపిక చేయలేదు. దీంతో టీ20 వరల్డ్‌కప్-2022 టోర్నీలో ఆడాలని ఉన్నప్పటికీ.. సెలక్టర్ల ఆలోచన వేరే విధంగా ఉండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తన రిటైర్మెంట్ ప్రకటనలో వెల్లడించాడు కెవిన్. కాగా 2006 నుంచి 2021 వరకు 16 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్లో కెవిన్ ఒబ్రెయిన్ ఎన్నో సంచలన విజయాలు నమోదు చేశాడు. పలు రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. అవేమిటో పరిశీలిద్దాం. అంతర్జాతీయ క్రికెట్లో ఐరిష్ క్రికెటర్ కెవిన్ ఒబ్రెయిన్ సాధించిన విజయాలు: ►ఐసీసీ పురుషుల క్రికెట్ వరల్డ్‌కప్ ఈవెంట్లో అత్యంత వేగవంతమైన సెంచరీ భారత్ వేదికగా సాగిన వన్డే వరల్డ్‌కప్-2011 సందర్భంగా కెవిన్ ఈ ఫీట్ నమోదు చేశాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 50 బంతుల్లో శతకం పూర్తిచేసుకున్నాడు. మొత్తంగా 113(63 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో) పరుగులు సాధించాడు. కొండంత లక్ష్యం ముందున్న సమయంలో టాపార్డర్ నామమాత్రపు స్కోరుకే పరిమితమైన వేళ నేనున్నాంటూ కెవిన్ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఇంగ్లండ్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టి అద్భుత సెంచరీతో మెరిశాడు. దీంతో మేటి జట్టు అయిన ఇంగ్లండ్ విధించిన 328 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఐర్లాండ్ సరికొత్త రికార్డు సృష్టించింది. ►మొదటి, ఏకైక బ్యాటర్! అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో శతకం నమోదు చేసిన మొదటి, ఏకైక ఐర్లాండ్ ఆటగాడిగా కెవిన్ ఒబ్రెయిన్ ఘనత సాధించాడు. డబ్లిన్ వేదికగా 2018లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అతడు 118 పరుగులు చేశాడు. #OnThisDay in 2018, Kevin O’Brien became Ireland’s first Test centurion 🌟 He hit a glorious 118 against Pakistan in Dublin. Watch the moment 📽️ pic.twitter.com/x7lJdltWrs — ICC (@ICC) May 14, 2021 ►అరుదైన రికార్డు మూడు ఫార్మాట్లలోనూ సెంచరీ సాధించిన ఏకైక ఐర్లాండ్ ఆటగాడు కెవిన్ ఒబ్రెయిన్. పదహారేళ్ల తన సుదీర్ఘ కెరీర్లో వన్డేల్లో రెండు, టీ20లలో ఒకటి, టెస్టుల్లో ఒక శతకం సాధించాడు. 2013లో అవార్డు ఐర్లాండ్ జట్టులో కీలక ఆటగాడైన కెవిన్ ఒబ్రెయిన్ తన అద్భుత ఆట తీరుతో.. 2013లో ఐసీసీ మెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచాడు. మూడో ఆటగాడిగా.. 2006లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి.. తన కెరీర్లో మొత్తంగా 152 వన్డేల్లో భాగమైన కెవిన్ 141 ఇన్నింగ్స్‌లో 3619 పరుగులు చేశాడు. తద్వారా ఐర్లాండ్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన మూడో బ్యాటర్‌గా నిలిచాడు. ఈ ఫార్మాట్లో కెవిన్ అత్యధిక స్కోరు 142. సెంచరీలు రెండు. టీ20లలోనూ... 2008లో స్కాట్లాండ్తో మ్యాచ్‌లో పొట్టి ఫార్మాట్లో అడుగుపెట్టాడు కెవిన్ ఒబ్రెయిన్. మొత్తంగా 103 ఇన్నింగ్స్ ఆడి 1973 పరుగులు చేశాడు. తద్వారా టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు సాధించిన రెండో ఐర్లాండ్ బ్యాటర్‌గా నిలిచాడు. పొట్టి క్రికెట్లో కెవిన్ అత్యధిక స్కోరు 124. బౌలర్‌గానూ.. కుడిచేతి వాటం గల బ్యాటర్ అయిన కెవిన్ ఒబ్రెయిన్ రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్‌బౌలర్ కూడా. వన్డే క్రికెట్లో అతడు 116 ఇన్నింగ్స్‌లో 114 వికెట్లు తీశాడు. అత్యుత్తమ గణాంకాలు 4/13. తద్వారా ఐర్లాండ్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఘనత. ఇక టీ20 ఫార్మాట్లో 52 ఇన్నింగ్స్‌లో కెవిన్ 58 వికెట్లు కూల్చి.. ఈ ఘనత సాధించిన మూడో ఐర్లాండ్ బౌలర్‌గా నిలిచాడు. వీటితో పాటు కెవిన్ ఒబ్రెయిన్ పేరిట ఉన్న మరిన్ని రికార్డులు ►వన్డే ఫార్మాట్లో మొదటి బంతికే వికెట్ తీసిన 16వ ఆటగాడు కెవిన్ ఒబ్రెయిన్(ఇంగ్లండ్ క్రికెటర్ ఆండ్రూ స్ట్రాస్ వికెట్) ►ప్రపంచకప్ టోర్నీలో అలెక్స్‌తో కలిసి ఆరో వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం నమోదు(ఇంగ్లండ్ జట్టు మీద) ►ఐర్లాండ్ వన్డే జట్టు నాలుగో కెప్టెన్‌గా కెవిన్ ఒబ్రెయిన్ ►ఐర్లాండ్ టీ20 జట్టు రెండో సారథిగా కెవిన్ ఒబ్రెయిన్ -వెబ్‌డెస్క్ చదవండి: ZIM vs IND: నీటికి కటకట.. భారత ఆటగాళ్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు Kohli- Rohit: కోహ్లి కెప్టెన్సీలో జట్టు దూకుడుగా ఉండేది కాదు! రోహిత్ శర్మ అలా కాదు! అతడు ఉన్నాడంటే.. -
ఆటకు గుడ్‌బై చెప్పిన ఐర్లాండ్ క్రికెట్ దిగ్గజం.. సెలక్టర్ల వల్లేనంటూ!
Kevin O Brien: ఐర్లాండ్ క్రికెట్ దిగ్గజం కెవిన్ ఒబ్రెయిన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. పదహారేళ్ల సుదీర్ఘ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న టీ20 ప్రపంచకప్ టోర్నీ తర్వాత ఆట నుంచి వైదొలుగుదామని భావించినప్పటికీ.. గత కొన్ని రోజులుగా తనను సెలక్టర్లు పక్కనపెట్టారన్న 38 ఏళ్ల కెవిన్.. అందుకే రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు ట్విటర్ వేదికగా మంగళవారం సుదీర్ఘ నోట్ షేర్ చేశాడు. అందరికీ ధన్యవాదాలు! ‘‘ఐర్లాండ్ జట్టుకు ఆడిన ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను. ఈ ప్రయాణంలో ఎంతో మంది స్నేహితులను సంపాదించుకున్నాను. నాతో పనిచేసిన కోచ్‌లు.. సిబ్బందికి ధన్యవాదాలు. నాపై నమ్మకం ఉంచి అంతర్జాతీయ క్రికెట్లో ఆడే అవకాశం కల్పించిన అడీ బిరెల్, ఫిల్ సిమ్మన్స్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. క్రికెటర్‌గా నా ప్రయాణంలో వెన్నంటి నిలిచిన నా కుటుంబ సభ్యులకు థాంక్యూ. నేను ఆటలో బిజీగా ఉన్న సమయంలో కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకున్న నా భార్య రూత్ అనీకి ప్రత్యేక ధన్యవాదాలు’’ అంటూ కెవిన్ తన నోట్లో పేర్కొన్నాడు. 2006లో ఎంట్రీ ఇచ్చి! కాగా బ్యాటింగ్ ఆల్‌రౌండర్ కెవిన్ ఒబ్రెయిన్ 2006లో ఇంగ్లండ్‌తో వన్డే మ్యాచ్‌తో ఐర్లాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ.. టెస్టు క్రికెట్లో ఐర్లాండ్ జట్టు అసోసియేట్ మెంబర్షిప్ పొందడంలోనూ కీలకంగా వ్యవహరించాడు. ఇక 2008లో టీ20 ఫార్మాట్లో ఎంట్రీ ఇచ్చి.. మొత్తంగా 109 మ్యాచ్‌లు ఆడాడు. గతేడాది అక్టోబరు(వరల్డ్‌కప్)లో కెవిన్ తన చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత అతడిని సెలక్టర్లు పరిమిత ఓవర్ల జట్టుకు ఎంపిక చేయలేదు. ఈ నేపథ్యంలో కెవిన్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడం గమనార్హం. టెస్టుల్లో.. ఇదిలా ఉంటే.. 2018లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేసిన కెవిన్.. 2019లో లార్డ్స్ మైదానంలో తన చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. మొత్తంగా మూడు టెస్టులాడిన అతడు 258 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 118. వన్డేల్లో ఇలా వన్డేల విషయానికొస్తే.. 152 మ్యాచ్‌లు ఆడి 3619 పరుగులు(అత్యధిక స్కోరు 142) చేశాడు. పొట్టి ఫార్మాట్లో ఒక సెంచరీ(124 పరుగులు) నమోదు చేశాడు. కెవిన్ తన కెరీర్లో మొత్తం నాలుగు శతకాలు(టెస్టుల్లో ఒకటి, వన్డేల్లో రెండు, టీ20లలో ఒకటి) బాదాడు. బౌలర్‌గా అరుదైన ఘనత ఇక రైట్ ఆర్మ్ మీడియం పేసర్ అయిన కెవిన్.. వన్డేల్లో 114 వికెట్లు తన ఖాతాలో వేసుకుని.. ఐర్లాండ్ జట్టులో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతేకాదు.. ఐసీసీ పురుషుల క్రికెట్ వరల్డ్‌కప్ టోర్నీలో వేగవంతమైన సెంచరీ(50 బంతుల్లో 13 ఫోర్లు, ఆరు సిక్సర్లతో శతకం.. మొత్తంగా 113 పరుగులు) సాధించిన బ్యాటర్‌గానూ చరిత్రకెక్కాడు. 2011 ప్రపంచకప్ సందర్భంగా బెంగళూరులో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఈ ఫీట్ నమోదు చేశాడు. చదవండి: Kohli- Rohit: కోహ్లి కెప్టెన్సీలో జట్టు దూకుడుగా ఉండేది కాదు! రోహిత్ శర్మ అలా కాదు! అతడు ఉన్నాడంటే.. Thanks ☘️ pic.twitter.com/E4335nE8ls — Kevin O'Brien (@KevinOBrien113) August 16, 2022 -
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఆల్ రౌండర్..
డబ్లిన్: ఐర్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ కెవిన్ ఒబ్రెయిన్(37) వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐర్లాండ్‌కు 15ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించిన ఆయన.. వన్డే ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పి, టెస్టు, టీ20 ఫార్మాట్లలో కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. వన్డే క్రికెట్‌పై ఆసక్తి తగ్గిందని, అందుకే ఆ ఫార్మాట్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాని ఆయన పేర్కొన్నాడు. రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నాను అని ఒబ్రెయిన్ వివరించాడు. 2006లో అరంగేట్రం చేసిన కెవిన్ 153 వన్డేల్లో 3,618 పరుగులతో పాటు 114 వికెట్లను పడగొట్టాడు. ఐర్లాండ్ తరఫున వన్డేల్లో అత్యధిక వికెట్ల రికార్డు అతని పేరిటే ఉంది. భారత్ ఆతిథ్యమిచ్చిన 2011 వన్డే ప్రపంచకప్ ద్వారా వెలుగులోకి వచ్చిన కెవిన్.. అనంతరం స్టార్ బ్యాట్స్‌మన్‌గా ఎదిగాడు. ఆ వరల్డ్‌కప్‌లో బెంగళూరు వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కెవిన్.. పెను విధ్వంసం సృష్టించాడు. ఆ మ్యాచ్‌లో అతను కేవలం 50 బంతుల్లోనే 100 పరుగుల మార్క్ చేరుకుని, రికార్డు శతకాన్ని నమోదు చేసి తన జట్టుకు చారిత్రక విజయాన్ని అందించాడు. ఆ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 327 పరుగులు చేయగా, అనంతరం ఛేదనలో ఒబ్రెయిన్(113 రన్స్) మెరుపు సెంచరీ సాధించడంతో పసికూన ఐర్లాండ్ సంచలన విజయం సాధించింది. నాటికి వన్డే ప్రపంచకప్‌లో కెవిన్‌దే అత్యంత వేగవంతమైన శతకంగా నిలిచింది. చదవండి: క్రికెట్‌ను ఆటగా కాకుండా మతంలా మార్చిన ఆ ఇన్నింగ్స్‌కు 38 ఏళ్లు.. -
ఊహించని ట్విస్ట్.. పాపం కెవిన్ ఒబ్రెయిన్
డబ్లిన్ : భారీ సిక్సర్లకు కేరాఫ్‌గా ఉండే ఐర్లాండ్ స్టార్ బ్యాట్స్‌మన్ కెవిన్ ఒబ్రెయిన్‌కు ఇప్పుడు పెద్ద చిక్కు వచ్చిపడింది. మ్యాచ్ గెలిచినందుకు సంతోషించాలా లేక కారు అద్దం పగిలినందుకు బాధపడాలా అన్న సందిగ్ధంలో పడిపోయాడు. అదేంటి మ్యాచ్ గెలిపించినందుకు సంతోషించాలి గానీ ఇలా సందిగ్ధంలో ఉండడం ఎందుకు అని అనుకుంటున్నారా.. అసలు విషయం అక్కడే ఉంది. ఐర్లాండ్‌లో జరుగుతున్న ఇంటర్ ప్రొవిన్షియల్ టీ20 కప్ టోర్నీలో గురువారం డబ్లిన్ వేదికగా నార్త్‌వెస్ట్ వారియర్స్, లీన్స్టర్ లైటనింగ్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఆట ప్రారంభంలోనే వరుణుడు అడ్డుపడడంతో మ్యాచ్‌ను 12 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన లీన్స్టర్ జట్టులో ఓపెనర్‌గా వచ్చిన కెవిన్ ఒబ్రెయిన్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 37 బంతులెదుర్కొని 82 పరుగులు చేశాడు. మొత్తం కెవిన్ ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, 8 సిక్స్‌లతో విధ్వంసం సృష్టించాడు.దీంతో 12 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వారియర్స్ జట్టు 8 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది. దీంతో డక్త్‌వర్త్ లూయిస్ ప్రకారం లీన్స్టర్ జట్టు 24 పరుగులతో గెలుపొందింది. మ్యాచ్‌లో స్టార్ ఆఫ్ ది పర్సన్‌గా కెవిన్ ఒబ్రెయిన్ నిలిచాడు. ఇంతవరకు బాగానే ఉంది.. అయితే కెవిన్ కొట్టిన 8 సిక్సుల్లో ఒక బంతి వెళ్లి బయట పార్క్ చేసి ఉన్న కారు అద్దాలను ధ్వంసం చేసింది. మాములుగా మ్యాచ్ చూడడానికి వచ్చే ప్రేక్షకులదో లేక వేరే వారిదో అని ఊహిస్తాం. కానీ అసలు ఊహించని ట్విస్ట్ ఏంటంటే.. అద్దం పగిలిన కారు కెవిన్ ఓబ్రెయిన్దే. పాపం అతను కొట్టిన సిక్స్ తన కారు అద్దం ధ్వంసం చేస్తుందని అతను కూడా ఊహంచి ఉండడు. మ్యాచ్ అయిపోయిన తర్వాత బయటకు వెళ్దామని భావించిన కెవిన్ పార్క్ చేసిన తన కారు దగ్గరకు వచ్చాడు. అసలు విషయం తెలుసుకొని వెంటనే తాను కారు కొన్న టయోటా షోరూమ్‌కు కారును తీసుకెళ్లి జరిగిందంతా వివరించాడు. Didn’t need the air-con on the drive up to you lads. 🤣 unreal service once again. Never fails to disappoint. I’ll park further away next time 😝 #BestInTheBusiness https://t.co/tNKTG0tRLA — Kevin O'Brien (@KevinOBrien113) August 27, 2020 కారును ఇన్సురెన్స్ కోటా కింద రిపేయిరింగ్కు తరలించారు. అయితే రిపేరింగ్‌కు వెళ్లే ముందు తన కారుతో కొన్నిఫోటోలు దిగాడు. వీటిని టయోటా తన ట్విటర్లో షేర్ చేసింది. దీనిపై కెవిన్ సరదాగా స్పందించాడు.' ఇలా జరుగుతుందని ఊహించలేదు. నేను కొట్టిన సిక్స్ నా కారు అద్దాలను ధ్వంసం చేసింది. ఇక మీదట నా కారును గ్రౌండ్ ఆవల చాలా దూరంలో పార్క్ చేస్తా' అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చాడు. అయితే కెవిన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. 'పాపం కెవిన్ .. భారీ సిక్సులతో విరుచుకుపడే కెవిన్‌కు ఎంత కష్టం వచ్చింది.. ఆ ఒక్క సిక్స్ అతని పాలిట శాపమైంది.' అంటూ కామెంట్లు పెడుతున్నారు. (చదవండి : తండ్రి కాబోతున్న కోహ్లి, ఆసీస్ టెన్షన్) (తండ్రి కాబోతున్న విరాట్ కోహ్లి) -
వరల్డ్ కప్‌లో ఆ రికార్డు గుర్తుందా?
-
వరల్డ్ కప్‌లో ఆ రికార్డు గుర్తుందా?
సాక్షి, స్పోర్ట్స్ : వరల్డ్ కప్‌లో నమోదైన ఓ రికార్డుకు నేటితో సరిగ్గా 7 ఏళ్లు పూర్తయ్యింది. ఐర్లాండ్ ఆటగాడు కెవిన్ ఓబ్రెయిన్ వీర విహారంతో వరల్డ్ కప్‌లో వేగవంతంగా సెంచరీ చేసిన ఆటగాడిగా ఓబ్రెయిన్ తన పేరిట రికార్డు లిఖించుకున్నాడు. మార్చి 2, 2011 బెంగళూర్ చిన్నస్వామి స్టేడియంలో ఇంగ్లాండ్‌తో ఐర్లాండ్ మ్యాచ్ జరిగింది. ఐర్లాండ్ బౌలర్లను ఆటాడుకున్న ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ 328 లక్ష్యాన్ని ప్రత్యర్థికి నిర్దేశించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ కెవిన్ ఓబ్రెయిన్ ఊచకోతతో చరిత్రాత్మక విజయాన్ని అందుకుంది. మొత్తం 63 బంతుల్లో 113 పరుగులు సాధించిన ఓబ్రెయిన్ 13 ఫోర్లు, 6 సిక్స్‌లు బాదాడు. ఈ క్రమంలో 50 బంతుల్లోనే అతను సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇప్పటిదాకా ప్రపంచ కప్‌లో నమోదైన ఫాస్టెస్ట్ సెంచరీ ఇదే కావటం విశేషం. ఓబ్రెయిన్ రికార్డును గుర్తు చేస్తూ ఐసీసీ తన ట్విట్టర్ ఖాతాలో అతని ఇన్నింగ్స్‌ను పోస్టు చేసింది. 100 runs off just 50 balls! 🔥#OnThisDay in 2011, @KevinOBrien113 blasted the fastest ever @cricketworldcup century as Ireland recorded the biggest successful chase in the tournament's history in a famous win against England! pic.twitter.com/EyADIj3jdx — ICC (@ICC) 2 March 2018 -
కెవిన్ ఓబ్రెయిన్ వన్ మ్యాన్ షో
నోయిడా: అఫ్గనిస్తాన్ తో జరుగుతున్న వన్డే సిరీస్‌ను ఐర్లాండ్ 2-2తో సమం చేసింది. గ్రేటర్ నోయిడాలో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన నాలుగో వన్డేలో ఐర్లాండ్‌ను కెవిన్ ఓబ్రెయిన్ ఒంటిచేత్తో గెలిపించాడు. మరో 19 బంతులు ఉండగానే మూడు వికెట్లతో అఫ్గనిస్తాన్ పై ఐర్లాండ్ నెగ్గింది. తొలుత టాస్ గెలిచిన అఫ్గాన్ జట్టు 49.5 ఓవర్లలో 220 పరుగులకే ఆలౌటైంది. 83 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన జట్టును టెయిలెండర్లు మహమ్మద్ నబీ(64 బంతుల్లో 41: 3 ఫోర్లు), షఫీఖుల్లా(42 బంతుల్లో 42: 8 ఫోర్లు), దౌలత్ జర్దాన్(53 బంతుల్లో 41 నాటౌట్: 3 ఫోర్లు, 1 సిక్సర్) ఆదుకోవడంతో రెండు వందల మార్కును చేరుకుంది. కెవిన్ ఓబ్రెయిన్ తొలి ఓవర్లో షహజాద్(1)ను, మూడో ఓవర్లో రహమత్ అలీని డకౌట్ చేశాడు. ఓవరాల్‌గా 4/26తో అఫ్గాన్ ప్లేయర్స్‌ను కట్టడిచేశాడు. 221 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ కు ఓపెనర్లు జాయిస్(24), స్టిర్లింగ్(28) శుభారంభాన్నిచ్చారు. 9.3 ఓవర్లలో 48 పరుగులు జోడించారు. జట్టు స్కోరు 73 పరుగుల వద్ద ఓబ్రెయిన్ రిటైర్డ్ హర్ట్ గా వెళ్లాడు. 6 వికెట్లకు 130 పరుగులు చేసి కష్టాల్లో ఉన్న ఐర్లాండ్‌ను ఓబ్రెయిన్ ఆదుకుని ఓంటిచేత్తో మ్యాచ్ గెలిపించాడు. కీపర్ విల్సన్(67 బంతుల్లో 41: 3 ఫోర్లు) తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు ఓబ్రెయిన్. 60 బంతుల్లో 72 పరుగులు చేసి అజేయంగా నిలిచి మరో 19 బంతులు ఉండగానే జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. దీంతో ఐదు వన్డేల సిరీస్ 2-2తో సమమైంది. మార్చి 24న ఇదే వేదికలో జరగనున్న నిర్ణయాత్మక ఐదో వన్డేలో నెగ్గిన జట్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది.