
ఐర్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ ఒబ్రెయిన్ లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022లో శతకంతో మెరిశాడు. అతని విధ్వంసం ధాటికి గుజరాత్ జెయింట్స్ మరో 8 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. శనివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా గుజరాత్ జెయింట్స్, ఇండియా క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఆష్లే నర్స్ 43 బంతుల్లో 8 ఫోర్లు, 9 సిక్సర్లతో 103 పరుగులు నాటౌట్ విధ్వంసం సృష్టించగా.. దినేశ్ రామ్‌దిన్ 31 పరుగులు చేశాడు. వీరిద్దరి మినహా మిగతావారెవరు పెద్దగా రాణించింది లేదు. గుజరాత్ జెయింట్స్ బౌలింగ్‌లో తిసారా పెరీరా, ఎమ్రిత్, అప్పన్న తలా రెండు వికెట్లు తీశారు.
అనంతరం 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జెయింట్స్ 18.4 ఓవర్లలో టార్గెట్‌ను అందుకుంది. కెవిన్ ఓబ్రెయిన్ 61 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 106 పరుగుల చేయగా.. పార్థివ్ పటేల్ 24, యష్‌పాల్ సింగ్ 21 పరుగులు చేశారు. ఇండియా క్యాపిటల్స్ బౌలింగ్‌లో ప్రవీణ్ తాంబే 3, లియామ్ ప్లంకెట్ 2, ఆష్లే నర్స్, మిచెల్ జాన్సన్‌లే తలా ఒక వికెట్ తీశారు.
Comments
Please login to add a commentAdd a comment