ఇండోర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన అఖరి టీ20లో 49 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. 228 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 178 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో కార్తీక్(46) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ తీవ్రంగా నిరాశపరిచాడు. రబాడ వేసిన తొలి ఓవర్‌లో రోహిత్ డకౌట్‌గా వెనుదిరిగాడు.
ఈ క్రమంలో రోహిత్ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. పురుషుల టీ20 క్రికెట్‌లో అత్యధిక సార్లు సింగిల్ డిజిట్ స్కోర్‌కే ఔటైన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. రోహిత్ ఇప్పటి వరకు 43 సార్లు సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యాడు.
ఇంతకుముందు ఈ చెత్త రికార్డు ఐర్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ ఓబ్రియన్(42 సార్లు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో రోహిత్ ఈ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. కాగా టీ20 ప్రపంచకప్-2022 కోసం టీమిండియా ఆక్టోబర్6న ఆస్ట్రేలియాకు బయలు దేరనుంది.
చదవండి: T20 World Cup 2022: బుమ్రా స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు? రోహిత్ ఎమన్నాడంటే?
Comments
Please login to add a commentAdd a comment