టీ20 వరల్డ్‌కప్ 2024 తుది అంకానికి చేరింది. బార్బడోస్ వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య ఇవాళ (జూన్ 29) ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభంకానుంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మ్యాచ్ జరిగే సమయానికి వర్షం పడే సూచనలున్నట్లు తెలిపింది. ఒకవేళ ఇవాళ మ్యాచ్ రద్దైనా రిజర్వ్ డే ఉంది. రిజర్వ్ డేలో కూడా మ్యాచ్ రద్దైతే ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు.
హిట్‌మ్యాన్ మరో 34 పరుగులు చేస్తే..
వరల్డ్‌కప్ ఆధ్యాంతం సూపర్ ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మ.. ఫైనల్ మ్యాచ్‌లో మరో 34 పరుగులు చేస్తే టోర్నీ లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలుస్తాడు. రోహిత్ ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 41.33 సగటున 155.97 స్ట్రయిక్‌రేట్‌తో 3 అర్ద సెంచరీల సాయంతో 248 పరుగులు చేశాడు. ఇందులో 22 ఫోర్లు, 15 సిక్సర్లు ఉన్నాయి. ప్రస్తుతం వరల్డ్‌కప్ లీడింగ్ రన్ స్కోరర్‌గా రహ్మానుల్లా గుర్బాజ్ ఉన్నాడు. గుర్బాజ్ 8 మ్యాచ్‌ల్లో 124.34 స్ట్రయిక్‌రేట్‌తో 281 పరుగులు చేశాడు.
అర్ష్‌దీప్ సింగ్ మరో 3 వికెట్లు తీస్తే..
ఈ టోర్నీలో మంచి ఫామ్‌లో ఉన్న టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ మరో 3 వికెట్లు తీస్తే టోర్నీ లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలుస్తాడు. అర్ష్‌దీప్ ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు తీసి సెకెండ్ లీడింగ్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు. టోర్నీ లీడింగ్ వికెట్ టేకర్‌గా ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ ఫజల్ హక్ ఫారూఖీ (8 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు) ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment