లంక ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్‌లో మూడు రోజుల్లోనే ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు బద్దలైంది. జులై 7న కొలొంబో స్ట్రయికర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డంబుల్లా సిక్సర్స్ ఆటగాడు కుశాల్ పెరీరా 50 బంతుల్లో శతక్కొట్టగా.. ఇవాళ (జులై 10 అదే కొలొంబో స్ట్రయికర్స్‌పై జాఫ్నా కింగ్స్ ఆటగాడు రిలీ రొస్సో 44 బంతుల్లో సెంచరీ చేశాడు. జాఫ్నాతో జరిగిన మ్యాచ్‌లో రొస్సో 50 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 108 పరుగులు (నాటౌట్) చేశాడు.
లంక ప్రీమియర్ లీగ్‌లో ఇది మూడో అత్యధిక స్కోర్ కూడా కావడం విశేషం. రొస్సో పేరిట పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో కూడా ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు నమోదై ఉండటం మరో విశేషం.
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కొలొంబో.. గ్లెన్ ఫిలిప్స్ (32 బంతుల్లో 58; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. కొలొంబో ఇన్నింగ్స్‌లో ఏంజెలో పెరీరా (34), రహ్మానుల్లా గుర్బాజ్ (27) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. జాఫ్నా బౌలర్లలో అజ్మతుల్లా, అశిత ఫెర్నాండో చెరో 2 వికెట్లు.. మధుషన్, షంషి, ఫేబియన్ అలెన్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం 189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జాఫ్నా.. రిలీ రొస్సో మెరుపు శతకంతో విజృంభించడంతో 18.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. జాఫ్నా ఇన్నింగ్స్‌లో రొస్సోతో పాటు చరిత్ అసలంక (58) రాణించారు. కొలొంబో బౌలర్లలో వెల్లలగే, తస్కిన్ అహ్మద్, షాదాబ్ ఖాన్ తలో వికెట్ తీశారు.
Comments
Please login to add a commentAdd a comment