చిన్న‌నాటి స్నేహితుడిని క‌లిసిన గిల్‌.. 14 ఏళ్ల త‌ర్వాత‌! వీడియో | Shubman Gills Gesture For UAE Bowler Also A Childhood Friend, Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

Asia Cup 2025: చిన్న‌నాటి స్నేహితుడిని క‌లిసిన గిల్‌.. 14 ఏళ్ల త‌ర్వాత‌! వీడియో

Sep 12 2025 9:26 PM | Updated on Sep 13 2025 12:24 PM

Shubman Gills Gesture For UAE Bowler, Also A Childhood Friend

టీమిండియా స్టార్ ప్లేయ‌ర్‌, టెస్టు కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్ త‌న చిన్న‌నాటి స్నేహితుడు సిమ్రన్‌జీత్‌ సింగ్‌ను 14 ఏళ్ల త‌ర్వాత క‌లిశాడు. ఇందుకు ఆసియాక‌ప్‌-2025 వేదికైంది. పంజాబ్‌కు చెందిన స్పిన్న‌ర్‌ సిమ్రంజీత్ సింగ్ ప్ర‌స్తుతం యూఏఈ త‌ర‌పున అంత‌ర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు.

ఈ మెగా టోర్నీలో భాగంగా బుధవారం దుబాయ్ వేదిక‌గా యూఏఈ, భార‌త్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్‌లో యూఏఈను తొమ్మిది వికెట్ల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. అయితే ఈ మ్యాచ్ ముగిశాక గిల్‌.. సిమ్రన్‌జీత్‌ వ‌ద్ద‌కు వెళ్లి ఆలింగ‌నం చేసుకుంటూ ఆప్యాయతగా మాట్లాడాడు.

ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌లవుతోంది. ఈ మ్యాచ్‌లో గిల్ కేవ‌లం 9 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్స్‌తో 20 ప‌రుగులు చేశాడు. అత‌డితో పాటు అభిషేక్ శ‌ర్మ‌( 16 బంతుల్లో 30) మెరుపులు మెరిపించాడు. దీంతో 58 ప‌రుగుల స్వల్ప ల‌క్ష్యాన్ని భార‌త్ కేవ‌లం 4.3 ఓవ‌ర్ల‌లో చేధించింది.

నాకు గిల్ తెలుసు..
కాగా భార‌త్‌తో మ్యాచ్‌కు ముందు పీటీఐతో మాట్లాడిన  సిమ్రన్‌జీత్‌.. గిల్ త‌న‌కు చిన్ననాటి నుంచి తెలుసు అని చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడు అతడికి తాను గుర్తున్నానో లేదో తెలియదని ఈ యూఏఈ స్పిన్న‌ర్ పేర్కొన్నాడు. కానీ ఇప్పుడు గిల్ క‌లిసి మాట్లాడ‌డంతో సిమ్రన్‌జీత్ ఆనందంలో మునిగి తేలిపోతున్నాడు. ఇక భార‌త్ త‌మ త‌దుప‌రి మ్యాచ్‌లో ఆదివారం దుబాయ్ వేదిక‌గా పాకిస్తాన్‌తో త‌ల‌ప‌డ‌నుంది.


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement