
ముంబై: వచ్చే నెలలో భారత మహిళల క్రికెట్ జట్టు వెస్టిండీస్‌తో 3 వన్డేలు, 3 టి20లు ఆడనుంది. దాంతో పాటు జనవరిలో స్వదేశంలో ఐర్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. ఈ మూడు సిరీస్‌ల కోసం బీసీసీఐ బుధవారం షెడ్యూల్ ప్రకటించింది.
డిసెంబర్ 15 నుంచి వెస్టిండీస్ మహిళల జట్టు భారత్‌లో పర్యటించనుండగా... నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో వరుసగా మూడు టి20లు (15న, 17న, 19న) ఆడనుంది. ఆ తర్వాత వడోదరలో డిసెంబర్ 22, 24, 27వ తేదీల్లో మూడు వన్డేలు ఆడనుంది.
అనంతరం వచ్చే ఏడాది జనవరి 10, 12, 15న రాజ్‌కోట్‌లో ఐర్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. వచ్చే ఏడాది భారత్ వేదికగా మహిళల వన్డే ప్రపంచకప్ జరగనుండగా... ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్‌లో భాగంగా ఈ సిరీస్‌లు జరగనున్నాయి.