జోహన్నెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో 36 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో పాక్ క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో పాక్ యువ ఓపెనర్ సైమ్ అయూబ్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.
94 బంతుల్లో 13 ఫోర్లు, 12 సిక్స్‌లతో 101 పరుగులు చేశాడు. అతడి మెరుపు ఇన్నింగ్స్ కారణంగా నిర్ణీత ఓవర్లలో పాకిస్తాన్ 308 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం లక్ష్య చేధనలో 271 పరుగులకు ప్రోటీస్ ఆలౌటైంది.
కాగా ఈ సిరీస్‌లో అయూబ్‌కు రెండో సెంచరీ కావడం గమనార్హం. పార్ల్ వేదికగా జరిగిన తొలి వన్డేలో కూడా అయూబ్ సెంచరీతో మెరిశాడు. ఈ క్రమంలో అయూబ్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
చరిత్ర సృష్టించిన అయూబ్..
వన్డే క్రికెట్‌లో దక్షిణాఫ్రికాపై రెండు లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన అతి పిన్న వయస్కుడిగా అయూబ్ రికార్డులెక్కాడు. 22 సంవత్సరాల, 207 రోజుల వయస్సులో అయూబ్ ఈ ఫీట్‌ను నమోదు చేశాడు.
ఇప్పటివరకు ఎవరూ ఈ ఘనతను సాధించలేకపోయారు. కాగా వన్డేల్లో దక్షిణాఫ్రికాపై సెంచరీ చేసిన అతి వయష్కుడి రికార్డు మాత్రం అయూబ్ సహచరుడు అబ్దుల్లా షఫీక్ పేరిట ఉంది. 22 ఏళ్ల 4 రోజుల వయస్సులో షఫీక్ ఈ ఘనత సాధించాడు.
వన్డేల్లో సౌతాఫ్రికాపై సెంచరీ చేసిన పిన్న వయస్కులు వీరే
వన్డేల్లో సౌతాఫ్రికాపై సెంచరీ చేసిన పిన్న వయస్కులు వీరే
అబ్దుల్లా షఫీక్(పాకిస్తాన్)- 22 ఏళ్ల, 4 రోజు
కేన్ విలియమ్సన్(న్యూజిలాండ్)- 22 ఏళ్ల, 167 రోజులు
సైమ్ అయూబ్ 22 ఏళ్ల, 207 రోజులు
సైమ్ అయూబ్ 22 ఏళ్ల, 212 రోజులు
రహ్మానుల్లా గుర్బాజ్ 22 ఏళ్ల 297 రోజులు
చదవండి: IND vs AUS: ఆసీస్‌తో నాలుగో టెస్టు.. ముంబై యువ సంచలనానికి పిలుపు!?
Comments
Please login to add a commentAdd a comment