
సాక్షి, హైదరాబాద్: భారత్, ఆస్ట్రేలియా టి20 మ్యాచ్ రద్దయిన కారణంగా ప్రేక్షకులకు టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) సిద్ధమైంది. దీనికి సంబంధించిన తేదీలను సోమవారం ప్రకటించింది. ఆయా తేదీల్లో ప్రేక్షకులు ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియానికి తమ టికెట్‌ను తీసుకురావడంతో పాటు తమ బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా అందజేయాల ని... నేరుగా అకౌంట్‌లోకి డబ్బులు బదిలీ చేస్తామని హెచ్‌సీఏ వెల్లడించింది.
ఉప్పల్‌లో మైదానం అనుకూలంగా లేకపోవడంతో ఈ నెల 13న జరగాల్సిన మూడో టి20 ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. కార్పొరేట్, హాస్పిటాలిటీ బాక్స్‌లకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని అపెక్స్ కౌన్సిల్ తెలిపింది.
అక్టోబర్ 23, 24: రూ. 800; అక్టోబర్ 25, 26: రూ. 1,000;
అక్టోబర్ 27, 28: రూ. 1,500; అక్టోబర్ 30, 31: రూ. 5,000
Comments
Please login to add a commentAdd a comment