హామిల్టన్: ఆతిథ్య న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్ తప్పించుకోవాలంటే తప్పక గెలవాల్సిన స్థితిలో భారత మహిళల క్రికెట్ జట్టు నేడు చివరి టి20 బరిలో దిగుతోంది. బ్యాటింగ్ వైఫల్యమే రెండు మ్యాచ్‌ల్లోనూ జట్టును దెబ్బతీసినందున ఈసారైనా ఆ విభాగంలో మెరుగ్గా రాణించాల్సిన అవసరం ఉంది. టాపార్డర్ బ్యాటర్లు స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్‌లపై జట్టు అతిగా ఆధారపడుతోంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఈ పర్యటనలో స్థాయికి తగ్గ ఇన్నింగ్సే ఆడలేదు.
త్వరలో టి20లకు వీడ్కోలు పలకనున్న వెటరన్ మిథాలీరాజ్ మరోసారి బెంచ్‌కే పరిమితం కానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మిడిలార్డర్ మెరుగైన స్కోరు చేస్తేనే జట్టుకు విజయావకాశాలు ఉంటాయి. మరోవైపు ముందుగా బ్యాటింగ్‌కు దిగినా, బౌలింగ్ చేసినా ప్రత్యర్థిని కీలక సమయాల్లో దెబ్బకొడుతూ సొంతగడ్డపై న్యూజిలాండ్ సమష్టిగా రాణిస్తోంది. భారత్... ఈ మ్యాచ్‌లో కలసి కట్టుగా ఆడితేనే గెలుపు తీరం చేరుతుంది.
►ఉదయం గం. 8.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment