
లక్నో : భారతరత్న అటల్‌బిహారీ వాజ్‌పేయి క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న భారత్-వెస్టిండీస్ రెండో టీ20లో టీమిండియా బ్యాట్స్‌మెన్ చెలరేగారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 195 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ 111 (8x4, 7x6, బంతులు 61) పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 41 బంతుల్లో 43 పరుగులు చేసి జట్టు భారీ స్కోర్‌కు బాటలు వేశాడు. రోహిత్, ధావన్‌లు తొలి వికెట్‌కు 123 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. ఫస్ట్‌డౌన్‌లో వచ్చిన రిషభ్‌పంత్ 5 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. లోకేష్‌రాహుల్ 26 పరుగులతో రోహిత్‌తో పాటు నాటౌట్‌గా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment