చెన్నై: వెస్టిండీస్‌తో జరిగిన చివరిదైన మూడో టీ20లో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఓపెనర్ శిఖర్ ధావన్.. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక టీ20 పరుగులు(అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో) సాధించిన జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు.. విండీస్‌తో మూడో టీ20లో ధావన్ 92 పరుగులతో మెరిశాడు. ఫలితంగా ఈ ఏడాది అంతర్జాతీయ టీ20ల్లో ధావన్ 572 పరుగులతో మూడో స్థానానికి ఎగబాకాడు.
ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లి(641) టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. 2016లో విరాట్ కోహ్లి ఈ మార్కును చేరాడు. ఆ తర్వాత స్థానంలో ఫకార్ జమాన్(576-2018) రెండో స్థానంలో ఉండగా, ధావన్ మూడో స్థానాన్ని ఆక్రమించాడు. ఈ క‍్రమంలోనే రోహిత్ శర్మను అధిగమించాడు ధావన్. ఈ ఏడాది ఇప్పటివరకూ టీ20ల్లో రోహిత్ సాధించిన పరుగులు 560.
ఇక టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో అత్యధిక సార్లు గెలిచిన జాబితాలో టీమిండియా రెండో స్థానంలో నిలిచింది. భారత్ జట్టు మూడుసార్లు 3-0తో టీ20 సిరీస్‌ను గెలవగా, పాకిస్తాన్ ఐదుసార్లు విజయం సాధించింది. ఇక్కడ అప్ఘానిస్తాన్‌తో కలిసి భారత్ సంయుక్తంగా రెండో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఐర్లాండ్, న్యూజిలాండ్, యూఏఈ,వెస్టిండీస్‌లు ఒక్కోసారి మాత్రమే 3-0తో టీ20 సిరీస్‌లను గెలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment