చెన్నై: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో రెండొందల ఫోర్ల కొట్టిన ఆటగాడిగా రోహిత్ గుర్తింపు సాధించాడు. వెస్టిండీస్‌తో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన చివరి మ్యాచ్‌లో రోహిత్ ‘డబుల్ సెంచరీ’ ఫోర్ల్ క్లబ్‌లో చేరిపోయాడు. నిన్న మ్యాచ్‌లో రోహిత్ ఫోర్ మాత్రమే కొట్టి పెవిలియన్ చేరిన సంగతి తెలిసిందే. దాంతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ఫోర్లు కొట్టిన రెండో భారత ఆటగాడిగా రోహిత్ నిలిచాడు.
ఇక్కడ భారత తరపున విరాట్ ముందున్నాడు. విరాట్ కోహ్లి 214 ఫోర్లతో ఉండగా, రోహిత్ పేరిట 200 ఫోర్లు ఉన్నాయి. కాగా, ఓవరాల్‌గా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ఫోర్లు కొట్టిన ఆటగాళ్లలో శ్రీలంక క్రికెటర్ తిలకరత్నే దిల్షాన్(223) ముందు వరుసలో ఉన్నాడు. ఆ తర్వాత స్థానంలో అఫ్గానిస్తాన్ ఆటగాడు మొహ్మద్ షెహజాద్(218) నిలిచాడు. ఆపై వరుస స్థానాల్లో కోహ్లి, మార్టిన్ గప్తిల్, రోహిత్ శర్మలు ఉన్నారు. ఇక్కడ గప్తిల్, రోహిత్‌లు సంయుక్తంగా నాల్గో స్థానంలో ఉన్నారు. చెన్నై టీ20లో భారత్ ఆఖరి బంతికి గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. విండీస్ నిర్దేశించిన 182 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఆరు వికెట్ల తేడాతో ఛేదించి సిరీస్‌ను ఘనంగా ముగించింది.
ఇక్కడ చదవండి: ఆఖరి బంతికి ముగించారు
Comments
Please login to add a commentAdd a comment