
కోల్‌కతా: వెస్టిండీస్‌తో ఆదివారం నుంచి ఆరంభం కానున్న మూడు టీ20ల సిరీస్‌కు ఎంఎస్ ధోనికి విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. ధోని స్థానంలో వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు రిషబ్‌కు ఇదే చక్కటి అవకాశం అంటున్నాడు తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ. ‘కొన్నేళ్లుగా భారత జట్టులో ధోని ఒక కీలక ఆటగాడు. అయితే విండీస్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు అతని అనుభవాన్ని మిస‍్సవుతున‍్నాం.
అదే సమయంలో ఈ సిరీస్ కచ్చితంగా రిషబ్ పంత్‌కు మంచి అవకాశమనే చెప్పాలి. పంత్‌తో పాటు దినేశ్ కార్తీక్‌కు ఇది చాలా కీలకం. వచ్చే వరల్డ్‌కప్‌కు ఏదో పరిమితమైన మౌలిక వనరులతో సిద్ధం కాదల్చుకోలేదు. మాకు చాలా ఆప‍్షన్‌లు ఉన్నాయి. వాటిని తగిన విధంగా వినియోగించుకోవడంపైనే ప‍్రస్తుత దృష్టి సారించాం. మా రిజర్వ్ బెంచ్ బలం పరీక్షించడమే మా లక్ష్యం. ఆ క‍్రమంలోనే ఆటగాళ్లను పరీక్షిస్తున్నాం. మా జట్టులో చాలా కొత్త ముఖాలు న్నాయి. కేవలం 15 మందితో కూడిన జట్టే కాదు.. మరో 15 మందితో కూడిన బలాన్ని అట్టి పెట్టుకోవడమే మా ముందున్న కర్తవ్యం. ఎవర‍్ని అదృష్టం వరిస్తుందో వేచి చూడాలి’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment