రోహిత్‌ను ఊరిస్తున్న టీ20 రికార్డు | Rohit Sharma Looks Stay on Another T20 Record | Sakshi
Sakshi News home page

రోహిత్‌ను ఊరిస్తున్న టీ20 రికార్డు

Published Fri, Nov 9 2018 4:49 PM | Last Updated on Fri, Nov 9 2018 5:48 PM

Rohit Sharma Looks Stay on Another T20 Record - Sakshi

చెన్నై:అంతర్జాతీయ టీ20ల్లో నాలుగు శతకాలు సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌ రికార్డును తన పేరిట లిఖించుకున్న టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మను మరో రికార్డు ఊరిస్తోంది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగుల రికార్డు సాధించడానికి రోహిత్‌ 69 పరుగుల దూరంలో ఉన్నాడు.  మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా చెన్నై వేదికగా ఆదివారం వెస్టిండీస్‌తో జరగబోయే ఆఖరి టీ20లో రోహిత్‌‌ ఈ రికార్డును సాధిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.

ఈ పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గా న్యూజిలాండ్‌ క్రికెటర్‌ మార్టిన్‌ గఫ్తిల్‌(2271) అందరికంటే ముందు ఉన్నాడు. ఆ తర్వాత స్థానంలో రోహిత్‌(2203) కొనసాగుతున్నాడు. గత టీ20లో శతకం సాధించిన రోహిత్‌ శర్మ.. పలు రికార్డులను బ్రేక్‌ చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో గఫ్తిల్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలంటే.. విండీస్‌తో ఆఖరి టీ20లో రోహిత్‌కు మరో 69 అవసరం. భీకరఫామ్‌లో ఉన్న రోహిత్‌ శర్మ.. ఆ రికార్డును అందుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు.

ఇక్కడ చదవండి: రోహితారాజువ్వ

కెప్టెన్సీలోనూ రో‘హిట్టే’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement