దేశం తరఫున ఆడుతున్నప్పుడు మైదానంలో ధోని అంకితభావం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు మ్యాచ్‌లో జరిగిన ఒక ఘటన ధోని దేశభక్తిని మరోసారి ప్రపంచానికి చూపించింది. కివీస్ ఇన్నింగ్స్ సమయంలో ఒక అభిమాని భద్రతను ఛేదించుకొని గ్రౌండ్‌లోకి దూసుకొచ్చాడు. అతను నేరుగా ధోని వద్దకు వెళ్లి పాదాభివందనం చేశాడు.
ఈ క్రమంలో అతని చేతిలో ఉన్న మన జాతీయ జెండా నేలను తాకింది. అంతే... అమిత వేగంతో కిందకు వంగిన ధోని ముందుగా మువ్వన్నెల జెండాను తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ తర్వాతే సదరు అభిమానిని పక్కకు జరిపాడు. త్రివర్ణ పతాకాన్ని నేలకు తగలకుండా ‘లెఫ్ట్‌నెంట్ కల్నల్’ ధోని దానిపై తన గౌరవాన్ని ప్రదర్శించడం అందరినీ ఆకట్టుకుంది. ఆ క్షణం మ్యాచ్‌లో ‘మూమెంట్ ఆఫ్ ద డే’గా నిలిచింది.
ధోని దేశభక్తి!
Published Mon, Feb 11 2019 3:32 AM | Last Updated on Mon, Feb 11 2019 3:32 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment