అతడిలా ఆడితే కెప్టెన్లు, బౌలర్లకు కష్టమే  | MS Dhoni Can Make Life Difficult for any Captain | Sakshi
Sakshi News home page

అతడిలా ఆడితే కెప్టెన్లు, బౌలర్లకు కష్టమే 

Published Wed, May 2 2018 1:29 AM | Last Updated on Wed, May 2 2018 1:29 AM

MS Dhoni Can Make Life Difficult for any Captain - Sakshi

టైమింగ్‌ను దొరకబుచ్చుకుని చెలరేగుతున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని ఇలాగే ఆడితే... ప్రత్యర్థి కెప్టెన్లు, బౌలర్లకు కష్ట కాలమేనని ఆ జట్టు బ్యాట్స్‌మన్‌ డుప్లెసిస్‌ అన్నాడు. ‘ధోని అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. వైడ్‌ వేసినా లెగ్‌ సైడ్‌లో భారీ షాట్‌ కొట్టేలా కనిపిస్తున్నాడు.

తలచుకున్నదే ఆలస్యం... ఎలాంటి బంతినైనా షాట్‌ కొట్టేలా ఉన్న తనకు ఈ సమయంలో బౌలింగ్‌ చేయడం చాలా కష్టం’ అని కొనియాడాడు. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌ చేయగల అంబటి రాయుడు సామర్థ్యం తనను ఆకట్టుకుందని చెప్పుకొచ్చాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement