ఐపీఎల్‌లో మరో ఉత్కంఠభరిత ముగింపు... మహేంద్ర సింగ్ ధోని (44 బంతుల్లో 79 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) అద్భుత ప్రదర్శనతో సూపర్ కింగ్స్‌ను విజయానికి చేరువగా తెచ్చినా చివరకు పంజాబ్‌దే పైచేయి అయింది. విజయానికి చివరి ఓవర్లో 17 పరుగులు కావాల్సి ఉండగా, చెన్నై 12 పరుగులు మాత్రమే చేయగలిగింది. అంతకుముందు రెండు ఓవర్లలో కలిపి ధోని ధమాకా బ్యాటింగ్‌తో 38 పరుగులు రాగా... వెన్నునొప్పితో సరిగ్గా కదల్లేకపోయిన చెన్నై కెప్టెన్ ఆఖరి ఓవర్లో లాంఛనం పూర్తి చేయలేకపోయాడు. ఆదివారం ఇక్కడి పీసీఏ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో పంజాబ్ 4 పరుగుల తేడాతో చెన్నైను ఓడించింది. సొంతగడ్డపై అశ్విన్ సేనకు ఇది రెండో విజయం. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది.
సొంతగడ్డపై పంజాబ్‌కు మరో గెలుపు
Published Mon, Apr 16 2018 7:31 AM | Last Updated on Thu, Mar 21 2024 6:42 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement