ధోని (పాత ఫొటో)
కోల్‌కతా : కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో పరాజయంపై జట్టు సభ్యులు ఆత్మవిమర్శ చేసుకోవాలని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అన్నారు. ఫీల్డింగ్, బౌలింగ్‌లలో ఆటగాళ్లు విఫలం కావడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. పేలవ ఫీల్డింగ్, బౌలింగ్‌తో చెన్నై గురువారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి చవి చూసింది. బౌలింగ్ విఫలం కావడంతో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి నుంచి తృటిలో తప్పించుకుంది.
లైన్ అండ్ లెంగ్త్‌ను వదిలేసి, బౌలింగ్ ప్లాన్‌ను మరచిపోయి కేకేఆర్ బ్యాట్స్‌మన్లకు చెన్నై బౌలర్లు పరుగులు సమర్పించుకున్నారు. వాస్తవానికి ఏడో ఓవర్ వచ్చే సరికి క్రిస్ లిన్, రాబిన్ ఉతప్ప, సునీల్ నరైన్‌లను చెన్నై బౌలర్లు పెవిలియన్‌కు పంపారు. ఆ తర్వాత వచ్చిన యువ బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్, కేకేఆర్ కెప్టెన్ దినేశ్ కార్తీక్‌లు జట్టును గెలుపు తీరాలకు చేర్చారు.
ఫీల్డింగ్‌లో చెన్నై చేసిన పొరబాట్లు కూడా ధోనికి కోపం తెప్పించాయి. ఉత్తమ ఫీల్డర్‌గా పేరున్న జడేజా వరుస బంతుల్లో సునీల్ నరైన్ క్యాచ్‌లను జార విడిచారు. మైఖేల్ హస్సీ మైదానంలో వేగంగా కదలకపోయినా ఫీల్డింగ్‌లో మేనేజ్ విజయం సాధించడానికి కారణంగా అతను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండటమేనని ధోని అన్నారు. బౌలర్ల పంథాలో మార్పు లేకుంటే తరచుగా వారిని మార్చాల్సివుంటుందని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment