
పూణె : టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ధోని జీవితం ఆధారంగా ‘ఎంఎస్ ధోని ది అన్‌టోల్డ్ స్టోరి’ చిత్రం తెరకెక్కిదంటే అతని క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. కానీ ఆ సినిమాలో కూడా ధోని వ్యక్తిగత అంశాలను అంత లోతుగా చూపెట్టలేదనేది అభిమానుల భావన. మిస్టర్ కూల్ ధోని కూడా ఎప్పుడు తన వ్యక్తిగత విషయాలను బయటికి వెళ్లడించడానికి అంతగా ఆసక్తి చూపలేదు.
అభిమానులు మాత్రం అతని పర్సనల్స్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. వారందరికి ఆనందం కలిగించేలా.. ధోని తన ఫస్ట్ క్రష్ ఎవరో చెప్పేశాడు. మంగళవారం ఐపీఎల్ స్పాన్సర్స్ నిర్వహించిన ఓ ప్రచార కార్యక్రమంలో ధోని పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ధోనితో పాటు.. షేన్ వాట్సన్, రవీంద్ర జడేజా, సురేశ్ రైనాతో పాటు కొంత మంది సీఎస్‌కే ఆటగాళ్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాఖ్యాత ధోనిని ఫస్ట్ క్రష్ ఎవరో చెప్పాలని ప్రశ్నించారు.
అందుకు మొదట అయిష్టత వ్యక్తంచేసిన ధోని.. అప్పట్లో ఇలాంటి ట్రెండ్ లేదని తెలిపారు. చివరిగా మౌనం వీడిన ధోని.. తన ఫస్ట్ క్రష్ స్వాతి అని తెలిపారు. ఇది తన భార్యతో చెప్పొద్దని సరదాగా వ్యాఖ్యానించారు. తాను 1999లో ఇంటర్మీడియెట్ చదువుతున్నప్పుడు అ అమ్మాయిపై క్రష్ ఏర్పడిందని ధోని వెల్లడించారు. కాగా.. ధోని తన చిన్ననాటి స్నేహితురాలు సాక్షిని ధోని 2010లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.