మోసగాడిగా ముద్ర.. ఇప్పటికీ అదే అంటున్నారు: స్టార్‌ హీరో | Ranbir Kapoor Says About Being Labelled Cheater, That Became My Identity | Sakshi
Sakshi News home page

ఇద్దరు హీరోయిన్లతో డేటింగ్‌.. మోసగాడిగా ముద్ర వేశారు: యానిమల్‌ హీరో

Published Sun, Jul 21 2024 11:31 AM | Last Updated on Sun, Jul 21 2024 11:53 AM

Ranbir Kapoor Says About Being Labelled Cheater, That Became My Identity

సినిమా ఇండస్ట్రీలో ప్రేమ, బ్రేకప్‌లు సర్వసాధారణం. సెలబ్రిటీలు వాటిని మర్చిపోయినా జనాలు మాత్రం గుర్తుచేస్తూనే ఉంటారు. అలా తనపై చీటర్‌ (మోసగాడు) అని ముద్ర వేశాడంటున్నాడు బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌. తాజాగా యూట్యూబర్‌ నిఖిల్‌ కామత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రణ్‌బీర్‌ మాట్లాడుతూ.. నేను గతంలో ఇద్దరు సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్లతో డేటింగ్‌ చేశాను.

మోసగాడు
అ‍ప్పటినుంచి వారి మాజీ ప్రియుడు అని నన్ను సంభోదించేవారు. కాసినోవా అని మోసగాడు అని ఇలా ఏవేవో పేర్లు అంటగట్టారు. నా జీవితంలో చాలాభాగం చీటర్‌ అన్న పేరుతోనే బతికేశాను. ఇప్పటికీ కొందరు నన్ను చీటర్‌ అని అంటూనే ఉంటారు. నా కూతురు రాహా విషయానికి వస్తే తనంటే నాకు ప్రాణం. రాహాను చూస్తుంటే నా హృదయం తీసి నా చేతులో పెట్టినట్లు అనిపిస్తుంది. మా నాన్న (దివంగత నటుడు రిషి కపూర్‌)కు కోపం ఎక్కువ. కానీ చాలా మంచివాడు. ఏది చెప్పినా తల దించుకుని సరే అనేవాడిని. ఎన్నడూ నో చెప్పలేదు.

థెరపీ
నా విషయానికి వస్తే గతంలో నేను థెరపీ చేయించుకున్నాను. నా గురించి నేను ఎక్కువగా ఓపెన్‌ కాను. మనసు విప్పి మాట్లాడేందుకు థెరపీ ఉపయోగపడుతుందని భావించాను అని చెప్పుకొచ్చాడు. కాగా యానిమల్‌ మూవీతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టిన రణ్‌బీర్‌.. ప్రస్తుతం నితేశ్‌ తివారి దర్శకత్వంలో రామాయణం సినిమా చేస్తున్నాడు. అలాగే సంజయ్‌ లీలా భన్సాలీ డైరెక్షన్‌లో లవ్‌ అండ్‌ వార్‌ మూవీలోనూ నటించనున్నాడు.

చదవండి: మూడేళ్లుగా సింగిల్‌గానే.. నా కూతురు పెళ్లి చేసుకోనివ్వట్లేదు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement